అక్రమ సంబంధం: ప్రియురాలి మోజులో.. భార్యకు ఇంత అన్యాయమా?

Subscribe to Oneindia Telugu

లింగసముద్రం: ప్రియురాలి మోజులో పడ్డ ఓ భర్త కట్టుకున్న భార్యను ఏకంగా ఇంట్లోంచి గెంటేశాడు. అంతేకాదు, ఇల్లు ఇతరత్రా ఆస్తులన్ని ప్రియురాలి పేరిట రాసేశాడు. దీంతో అటు కాపురాన్ని చక్కదిద్దుకోలేక, సొంతంగా బతికే ఆసరా లేక ఆ ఇల్లాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే.. లింగసముద్రం గ్రామానికి చెందిన కామినేని సుజాత భర్త కామినేని చిన అంజయ్య గత కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. బలిజపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళతో కలిసి అతను ఐదేళ్లుగా ఈ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

husbands mistress attack on a housewife in prakasam

ఈ నెల 24న సదరు మహిళ కామినేని సుజాతతో వాగ్వాదానికి దిగింది. ఏకంగా ఇంటికొచ్చి మరీ.. నీ భర్త అంజయ్య ఈ ఇంటిని, మరో రెండు ఫ్లాట్లను తన పేర రాసిచ్చాడని, కాబట్టి తక్షణం నువ్వు ఖాళీ చేయాల్సిందేనని సుజాతతో గొడవపడింది. అదే రోజు రాత్రి అంజయ్యతో కలిసి సుజాతను జుట్టుపట్టి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టింది. దీంతో బాధితురాలు సుజాత న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman was attacked by her husbands mistress in Prakasam district. Husband also supporting her mistress regarding the attack
Please Wait while comments are loading...