Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vyuham Movie: వర్మ వ్యూహం ఓటీటీ రిలీజ్ కు బ్రేక్! విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం చిత్రం రాజకీయంగా కాక రేపుతోంది. సీఎం వైఎస్ జగన్ నిజ జీవిత ఘట్టాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ చేయడం వివాదాలకు కారణమవుతోంది. అయితే తాను నిర్మించే ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక వివాదం ఉండేలా చూసుకునే వర్మ.. ఎన్నికల వేళ ఈ సినిమాలో విపక్ష నేతల్ని టార్గెట్ చేయడం రచ్చకు కారణమవుతోంది.

ఈ సినిమా నిర్మాణానికి ముందూ, తర్వాత పదే పదే సీఎం జగన్ ను కలుస్తున్న రాంగోపాల్ వర్మ ఆయన సూచనలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. ఇవాళ విజయవాడలో వ్యూహం చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతున్నారు. దీనికి వైసీపీ కీలక నేతల్ని కూడా ఆహ్వానించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా వ్యూహం సినిమాకు హైప్ తెచ్చుకోవాలని వర్మ ప్రయత్నిస్తున్నారు. అయితే అదే సమయంలో ఈ సినిమాను న్యాయవివాదాలు వీడటం లేదు.

hyderabad court stops varmas vyuham movie relase in ott as he gearing up for pre-release event

తొలుత తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వర్మ వ్యూహం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ నేత నారా లోకేష్ సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. దీంతో తాత్కాలికంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపేసిన సెన్సార్ బోర్డు.. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు వర్మ సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ టీడీపీ న్యాయపోరాటానికి దిగింది.

ఈ సినిమాను ఓటీటీల్లో విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఓటీటీల్లో రిలీజ్ కాకుండా ఆదేశాలు ఇచ్చింది.మరోవైపు నారా లోకేష్ వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై డిసెంబర్ 26న విచారణ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+