న్యూ ఇయర్ వేడుకలు: హైదరాబాద్ ఫ్లై ఓవర్స్ బంద్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు అన్ని ఫ్లైఓవర్లను, కొన్ని కీలకమైన రోడ్లను పోలీసులు మూసి వేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల గల కీలకమైన రోడ్లను, ఫ్లైఓవర్లను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లై ఓవర్లను అన్నింటినీ మూసివేస్తారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వే దారుల్లో వాహనాల రాకపోకలను అనుమతించరు. లైట్ మోటార్ వెహికిల్స్‌ను, ప్యాసెంజర్ వాహనాలను మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు నగరం చుట్టుగల శివారు పట్టణాలను, విమానాశ్రయాన్ని కలిపే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతించరు.

విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్లను చూపిస్తే మాత్రం లైట్ మోటార్ వాహనాల్లో ప్రయాణించే బోనఫైడ్ ప్రయాణికులను మాత్రం అనుమతిస్తారు ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు

Hyderabad flyover

హుస్సేన్ సాగర్ చుట్టూ గల అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లను మంగళవారం రాత్రి పది గంటల నుంచి మర్నాడు తెల్లవారు జాము 2 గంటల వరకు మూసేస్తారు. హుస్సేన్ సాగర్‌కు వెళ్లే పలు మార్గాలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

రాష్ డ్రైవింగ్‌ను, డ్రంకెన్ డ్రైవింగ్‌ను నిరోధించడానికి హైదరాబాదులో పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల పేరు మీద రాష్ డ్రైవింగ్‌కు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటవరకు మాత్రమే అనుమతి ఉంటుందని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు చెప్పారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+