‘హైదరాబాద్ మాది కాదు, నాకిక్కడ పనిలేదు’: ఏపీ మంత్రి సంచలన నిర్ణయం

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం ప్రకటించారు. హైదరాబాద్‌ తమ రాజధాని కాదని స్పష్టం చేశారు. అంతేగాక, తనకు అక్కడ నివాసం కూడా అవసరం లేదుటూ తన అధికారిక నివాసాన్ని వదులుకున్నారు.

manikyala rao

దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు 2014లో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో 27వ నెంబర్‌ క్వార్టర్‌ను కేటాయించారు. ఇతర మంత్రులందరూ తమ హైదరాబాద్‌ నివాసాన్ని కొనసాగిస్తుండగా.. మాణిక్యాలరావు మాత్రం తనకు వద్దంటూ ప్రభుత్వానికి లేఖరాశారు.

ఏపీతో 'కియా' ఒప్పందం: ట్రంప్ సర్కారు ఆరా, సీఎంఓ ఆశ్చర్యం

దీంతో ఆ క్వార్టర్‌ కేటాయింపును రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాస వసతి కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Pydikondala Manikyala Rao said that Hyderabad is not theirs, that is why h will not stay there.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి