శ్రీవారి ఆలయం వద్ద ఇల్లీగల్ బిజినెస్ ప్రమోషన్: కంప్లైంట్ చేసిన కరాటే కల్యాణి- ఎఫ్ఐఆర్
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ లక్కీ డ్రాల ద్వారా డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. భారత్ న్యాయ సంహిత, ఐటీ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ అక్రమ లక్కీ డ్రా కోసం ఏకంగా తిరుమలనే వాడుకోవడం దీనికి కారణమైంది. పవిత్రమైన తిరుమల ఆలయం బ్యాక్ డ్రాప్ తో వాళ్లు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వారి పేర్లు- ప్రవీణ్ క్యాస, సిద్ధమోని మహేందర్. అక్రమ లక్కీ డ్రా కార్యకలాపాలను నిర్వహించడం, దీనికోసం ప్రజలను ఆకర్షించండం వారి వ్యాపారం. ఇందులో భాగంగా కూపన్లను ప్రమోట్ చేస్తుంటారు. ఇటీవలే వారిద్దరూ తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం ముందు నిల్చుని లక్కీ డ్రా కూపన్లను ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చిత్రీకరించారు. 399 రూపాయలను చెల్లిస్తే ఖరీదైన ఎస్‌యూవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, మోటార్‌సైకిళ్లు గెలుచుకోవచ్చని నమ్మబలికారు.

ప్రజల నమ్మకాన్ని చూరగొని చట్టవిరుద్ధ లక్కీ డ్రా పథకాలను ప్రచారం చేయడానికి ఏకంగా పవిత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలను వినియోగించుకుంటోన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అలియాస్ పడాల కళ్యాణి రంగంలోకి దిగారు. వారిద్దరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 318 (4), ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 66 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దీనిపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ కే శిల్పావల్లి మాట్లాడారు. అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. పడాల కళ్యాణి ఫిర్యాదు మేరకు ప్రవీణ్ క్యాస, సిద్ధమోని మహేందర్ పై కేసు నమోదైందని వెల్లడించారు. ఆన్‌లైన్ మోసం, అక్రమ లాటరీల నిర్వహణ, బెట్టింగ్ కుంభకోణం, మోసం కింద కేసులు వారిపై కేసులు నమోదయ్యాయని పంజగుట్ట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బీ వెంకట్ వివరించారు. తెలంగాణ స్టేట్ లాటరీల యాక్ట్ కింద కూడా కేసు పెట్టినట్లు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications