రేవ్‌పార్టీ భగ్నం, తప్పించుకోవాలని చూసిన యువతులు

రేవ్ పార్టీ ట్విస్ట్
మేడ్చల్‌లోని ఓ రిసార్టులో జరిగిన రేవ్ పార్టీ పైన పోలీసులు స్పందించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరు విదేశీయులే అని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఈ రేవ్ పార్టీలో భారీగా మద్యం, డ్రగ్స్ వినియోగించారని తెలిపారు.
కాగా, దాదాపు 200 వందలమంది వరకు రేవ్ పార్టీలో పాల్గొంటే 13 మందిని మాత్రమే అరెస్టు చేశారని, అరెస్టులో యువతులు కనిపించలేదని వార్తలు వచ్చాయి. దీని పైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రిసార్ట్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో పలువురు యువతులు తప్పించుకున్నారని తెలిపారు.
రౌడీ షీటర్ దారుణ హత్య
గుంటూరు నగరంలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం బ్రాడీపేటలో రమేష్ అనే రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు.
వేటగాళ్ల అరెస్ట్
వన్యమృగాలను వేటాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. వీరంతా లైసెన్స్ లేని గన్నుతో నీలుగాయిని వేటాడి చంపారు. నిందితులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం తానూరు అటవీ ప్రాంతంలో జరిగింది. వేటగాళ్ల నుంచి గన్ స్వాధీనం చేసుకుని... వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు బుక్ చేశారు.
టీఆర్ఎస్ సర్పంచ్ భర్త దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ అలివేలు భర్త తిరుపతయ్య (40)ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్టయ్యారు. నార్త్ జోన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిని మహారాష్ట్రకు చెందిన షాముదాఫిర్, షోయబ్ లుగా పోలీసులు గుర్తించారు. సిమి మాజీ సభ్యుడిని కలిసి అల్ ఖైదాలో చేరేందుకే వారు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన వారు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌లకు చెందిన ఉగ్రవాదులతో చాటింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జనరేటర్ పొగకు ఊపిరాడక మృతి
జనరేటర్ పొగకు ఊపిరాడక భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన విశాఖపట్నం ఎన్ఏడీ కొత్తరోడ్డు దరి గణేష్ నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర ర్వు, పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తుఫాను కారణంగా విద్యుత్తు లేకపోవడంతో మూడు రోజులుగా ఇంట్లో జనరేటర్ ఏర్పాటు చేసుకున్నారు.
మంగళవారం రాత్రి ఆయన కుమారులు ఇద్దరు సినిమాకు వెళ్లగా వెంకటశ్వర రావు వంట గదిలో జనరేటర్ ఆన్ చేసుకొని పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమా నుండి తిరిగి వచ్చిన తనయుడులు ఎంతసేపు తలుపు తట్టినా ఎవరు తీయలేదు. దాంతో బలవంతంగా తలుపులు తెరిచారు. భార్యాభర్తలు విగతజీవులుగా కనిపించారు. అప్పటికే ఆ గది నిండా జనరేటర్ పొగ పట్టి ఉంది.












Click it and Unblock the Notifications