రోహిత్ ఆత్మహత్య: వీసీ అప్పారావు సెలవుపై ఎందుకు వెళ్లారు?
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్యపై జాతీయ స్థాయిలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై, కేంద్ర మంత్రులపై జాతీయ స్థాయిలో ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో వీసీ పొదిలె అప్పారావు సెలవుపై వెళ్లారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆందోళనకు దిగిన విద్యార్థులతో చర్చలకు మార్గం వేయడానికే తాను సెలవుపై వెళ్లినట్లు అప్పారావు దక్కన్ క్రానికల్ ప్రతినిధితో అన్నారు. ఎన్ని రోజులు తాను సెలవుపై ఉంటాననే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని కూడా అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

చర్చలు జరగడానికి తాను ఫ్యాకల్టీతోనూ తనతో ఏకీభవించే కొన్ని సంస్థలతోనూ తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. హాస్టల్స్ నుంచి దళిత విద్యార్థులను బహిష్కరించడంపై, బహిరంగ ప్రదేశాల్లో తిరగాడనికి వీలు లేదని ఆంక్షలు విధించడంపై తీసుకున్న చర్యలపై రిజిస్ట్రార్ కేందర్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు అప్పారావు తెలిపారు.
చర్యలు తీసుకోవడంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒత్తిడి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వాళ్లు పంపిన రిమైండర్స్‌కు తాము జవాబు ఇవ్వలేదని, తీసుకున్న చర్యల గురించి మాత్రమే మంత్రిత్వ శాఖకు తెలియజేశామని, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హనుమంతరావు రాసిన లేఖకు కూడా తాము సమాధానం ఇవ్వలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications