సంక్రాంతి రద్దీ! హైదరాబాద్-విశాఖపట్నం విమాన టికెట్ ధరలకు రెక్కలు
సంక్రాంతి పండగకు హైదరాబాద్ నగరంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు కిటకటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లలో కిక్కిరిసిపోతున్నారు. మూడు నాలుగు వారాల క్రితమే బుక్ చేసుకున్నవారికే సీట్లు దొరుకుతున్నాయి. మిగితావారు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రైవేట్ బస్సుల్లో వెళదామంటే రేట్లను భారీగా పెంచారు. కొందరు చేసేదేం లేక అత్యధిక ఛార్జీలు పెట్టుకుని సొంతూళ్లకు పయనమవుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు కూడా విమాన ఛార్జీలను భారీగా పెంచాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చేవారికి విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

శని, ఆదివారాల్లో హైదరాబాద్ నగరం నుంచి విశాఖపట్నంకు కనీస ఛార్జీ రూ. 17,500కిపైనే ఉండటం గమనార్హం. ఇక, బెంగళూరు నుంచి విశాఖకు కనీస ఛార్జీలు రూ. 12 వేలకుపైగా ఉన్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు కనీస ధర రూ. 3400 నుంచి 4 వేలు మాత్రమే ఉండటం గమనార్హం.
అయితే, ప్రస్తుతం సంక్రాంతి డిమాండ్‌ను ఆసార చేసుకుని విమానయాన సంస్థలు మూడు నాలుగు రేట్లు ఛార్జీలు పెంచేశాయి. అయినప్పటికీ.. సొంతూళ్లకు తొందరగా, సుఖంగా వెళ్లాలనుకునేవారు రూ. వేలు పెట్టి వెళ్లకతప్పడం లేదు. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి తెలంగాణ ఇతర ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు నగరవాసులు భారీ ఎత్తున వెళుతున్న విషయం తెలిసిందే. దీంతో నగరం సంక్రాంతి పండగ మూడు రోజులపాటు ఖాళీగానే దర్శనమివ్వనుంది.












Click it and Unblock the Notifications