విహార యాత్ర: గోవాలో హైదరాబాద్ యువకుడు మృతి

కాగా, సెప్టెంబర్ 10న షాపు యజమానితో కలిసి పని మీద ఇతర ప్రాంతానికి వెళుతున్నానని ఇంట్లో వాళ్లతో చెప్పి గోవా వెళ్లాడు. అతనితోపాటు అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు మహ్మద్ పాషా(28), మరో నలుగురు యువకులు ముఖీద్, బిలాల్, అర్షద్, మరో యువకుడు గోవాకు వెళ్లారు.
శుక్రవారం గోవాలోని బీచ్‌లో స్నానం చేసేందుకు దిగారు. మహ్మద్ సమీ, పాషాకు ఈత రాకపోవడంతో నీట మునిగారు. ఆదివారం మహ్మద్ సమి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితికి చేరుకున్న మహ్మద్ పాషా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా, మహ్మద్ సమీ మృతి చెందిన విషయాన్ని అక్కడి పోలీసులు అతడి తండ్రి సలావుద్దీన్‌కు సమాచారమందించినట్లు తెలిసింది. దీంతో హఫీజ్ బాబానగర్‌లో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications