శ్రీశైలం డ్యాంలో కొనసాగుతున్న హైడ్రో గ్రాఫిక్ సర్వే .. మట్టి పూడికతో ప్రమాదం, డ్యాం నీటి సామర్ధ్యంపై చర్చ

శ్రీశైలం డ్యాం కు ప్రమాదం పొంచి ఉందా? శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందా? తెలుగు రాష్ట్రాలకు బహుళ ప్రయోజనకారి అయిన శ్రీశైలం డ్యాం భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. తాజాగా శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, డ్యాం లో చేరిన మట్టి పూడిక ఎంతగా ఉందో తెలుసుకోవడానికి హైడ్రో గ్రాఫిక్స్ సర్వే జరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం డ్యాం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శ్రీశైలం డ్యాం లో హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్న ముంబై నుండి వచ్చిన నిపుణులు

శ్రీశైలం డ్యాం లో హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్న ముంబై నుండి వచ్చిన నిపుణులు

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై ఇప్పటికే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించిన కేంద్రం నిపుణులతో శ్రీశైలం ప్రాజెక్టుపై హైడ్రో గ్రాఫిక్ సర్వేను చేపట్టింది. ముంబై నుండి వచ్చిన 12 మంది నిపుణులు హైడ్రో గ్రాఫిక్ సర్వేకు సంబంధించిన పరికరాలతో జలాశయంలో ఎంతమేరకు మట్టి పూడిక చేరిందో గుర్తించడానికి సర్వే నిర్వహిస్తున్నారు.

15 రోజుల పాటు కొనసాగనున్న సర్వే .. మట్టి పూడికతో తగ్గుతున్న నీటి నిల్వ

15 రోజుల పాటు కొనసాగనున్న సర్వే .. మట్టి పూడికతో తగ్గుతున్న నీటి నిల్వ

శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 308.6 రెండు టిఎంసిలు ఉండగా 2009 వరదల వల్ల దాని సామర్థ్యం 215 టీఎంసీలకు పడిపోయింది. అప్పట్లో వచ్చిన వరదల వల్ల శ్రీశైలం జలాశయం సుమారు తొంభై మూడు టీఎంసీల నీటిని కోల్పోవలసి వచ్చింది. ఇక తాజాగా మరోమారు శ్రీశైలం ప్రాజెక్టు పై హైడ్రో గ్రాఫిక్స్ సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు శ్రీశైలం రిజర్వాయర్ లో ఎంత మేరకు మట్టి పూడిక చేరుకున్నది. జలాశయం లో నీటి సామర్థ్యం ప్రస్తుతం ఎంత ఉంది అన్న అన్ని వివరాలను సేకరిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సంగమేశ్వరం వరకు 15 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించనున్నారు.

 ఎకో సౌండ్ పరికరాల ద్వారా హైడ్రో గ్రాఫిక్ సర్వే

ఎకో సౌండ్ పరికరాల ద్వారా హైడ్రో గ్రాఫిక్ సర్వే

ప్రత్యేకమైన బోట్లో ఎకో సౌండ్ పరికరాల ద్వారా శబ్దాన్ని జలాశయంలోకి పంపి ఎంత లోతులో పూడిక పేరుకు పోయిందో జియో టెక్నికల్ సర్వీసెస్ బృందం లెక్కిస్తారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి. ఈ నేపథ్యంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం తేల్చే పనులను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు. గత శుక్రవారం నుండి హైడ్రో గ్రాఫిక్ సర్వేను చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో వాటర్ స్టోరేజ్ పై ఆందోళన నెలకొంది.

సర్వేకు నిధులు సిడబ్ల్యుసి నే ఇస్తుందన్న సూపరింటెండెంట్ ఇంజనీర్

సర్వేకు నిధులు సిడబ్ల్యుసి నే ఇస్తుందన్న సూపరింటెండెంట్ ఇంజనీర్

ముంబై నిపుణుల బృందం శ్రీశైలం జలాశయంలో మట్టి పూడికను, కోతను అంచనా వేయడానికి వివరణాత్మక సర్వేను ప్రారంభించింది.ముంబైకి చెందిన టెక్నీషియన్ టీమ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నట్లు డ్యామ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ వెంకట రమణయ్య తెలిపారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ మాట్లాడుతూ, ఈ బృందం తమ సిబ్బంది మద్దతు మరియు పర్యవేక్షణతో సర్వే నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ చెప్పారు. అయితే, సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) దీనికి నిధులు సమకూరుస్తోందని ఆయన అన్నారు. చాలా గ్యాప్ తర్వాత సర్వే జరుగుతోంది కాబట్టి రిజర్వాయర్ పరిస్థితిపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తుంది.

ప్రతి ఏడు దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ స్థాయిని కోల్పోతున్న డ్యాం

ప్రతి ఏడు దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ స్థాయిని కోల్పోతున్న డ్యాం

రిజర్వాయర్ యొక్క బేస్ లెవల్‌లో ఏర్పడిన మట్టి పూడిక, కోత, డ్యామ్ యొక్క భద్రతా అంశాలను అధ్యయనం చేయడానికి ఈ బృందం సర్వే నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం డ్యామ్‌లో మట్టి పేరుకుపోవడంతో డ్యామ్ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ స్థాయిని కోల్పోతోందని అంచనా వేస్తున్నారు .ప్రస్తుతం, నిల్వ సామర్థ్యం దాని వాస్తవ సామర్థ్యం 308.060 టీఎంసీలకు గాను 215.80 టీఎంసీల నీటికి తగ్గింది.డ్యామ్ నుండి మట్టి పూడికను తొలగించకపోతే రాబోయే సంవత్సరాల్లో నిల్వ సామర్థ్యం భారీగా తగ్గుతుందని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు.

సర్వే చేసిన ప్రతీసారి తగ్గుతున్న నీటి సామర్ధ్యం

సర్వే చేసిన ప్రతీసారి తగ్గుతున్న నీటి సామర్ధ్యం

ఇప్పటికే మట్టి పూడికతో జలాశయం నీటి సామర్థ్యం తగ్గిందని, ప్రస్తుతం మరో సారి సర్వే చేస్తున్న నేపథ్యంలో రానురాను నీటి నిల్వ సామర్థ్యం ఎలా ఉండబోతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే చేసిన ప్రతిసారి భారీ ఎత్తున నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్న తీరు ప్రస్తుత ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్ లెవెల్ సగటున 500 మీటర్లు, శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు.

వరదల సమయంలో శ్రీశైలం డ్యాంలోకి కొట్టుకొస్తున్న మట్టితో జలాశయంలో పూడిక

వరదల సమయంలో శ్రీశైలం డ్యాంలోకి కొట్టుకొస్తున్న మట్టితో జలాశయంలో పూడిక


ప్రస్తుతం 215 టీఎంసీల నీటి మట్టం ఉన్న శ్రీశైలం జలాశయంలో తాజాగా జరుగుతున్న సర్వే, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం కంటే ఎంత మేర నీటి సామర్థ్యం తగ్గింది అనేది వెల్లడిస్తుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అడవులను నరికి వేయడం వల్ల భూమి కోతకు గురై వరదల సమయంలో మట్టి శ్రీశైలం జలాశయంలోకి కొట్టుకు రావడంతో శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతుంది .సర్వే పూర్తయిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వే అధికారులు దీనికి సంబంధించిన నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం అంచనా వేస్తారు. ఏదిఏమైనా తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపధ్యంలో నదీజలాల మీద కేంద్రం నిర్ణయం తీసుకునేలా గెజిట్ విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు నదీజలాల లెక్కలు, పలు ప్రాజెక్ట్ ల పరిస్థితి అంచనా వేసే పనిలో బిజీగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+