వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యానికే పోరు: విభజనపై మురళీమోహన్ ట్విస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Murali mohan
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ నటుడు మురళీమోహన్ మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు సమైక్యం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఎన్నాళ్లు కొనసాగినా తాను పాల్గొని విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడుతానని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావుతో పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని మురళీమోహన్ విమర్శించారు.

హైదరాబాద్‌పై చర్చకు రెడీ

సీమాంధ్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే విషయంపై తాను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అననారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 54 లక్షల జనాభా సీమాంధ్రకు చెందిందే అని ఆయన శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.

సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కాదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న 65 శాతం మంది సీమాంధ్రులకు న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోమని ఆయన అన్నారు.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, కోదండరామ్ ఢిల్లీ వెళ్లి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో అందరికీ తెలుసునని తెలుగుదేశం మరో నేత నర్సిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూాడ ఢిల్లీ వెళ్లి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

English summary
Telugudesam party leader and actor Murali Mohan siad that he will fight for united Andhra till the end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X