నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామన్నారు: సత్యంబాబు సంచలనం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా హత్య కేసులో అరెస్టై హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో జైలు నుంచి విడుదలైన సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పోలీసులే అకారణంగా ఈ హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు.
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా హత్య కేసులో అరెస్టై హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో జైలు నుంచి విడుదలైన సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పోలీసులే అకారణంగా ఈ హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు.
హత్య చేశాననే ఒప్పుకోకుంటే తనను చంపేస్తామని పోలీసులు బెదిరింపులకు గురిచేశారని చెప్పారు. అంతేగాక, తనను, తన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తామని పోలీసులు బెదరించారని సత్యంబాబు తెలిపారు.

ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన సత్యంబాబు.. తాను జైలులో 8ఏళ్లు నరకం అనుభవించినట్లు చెప్పారు. హత్యకు గురైన అయేషాను తాను ఎప్పుడూ చూడలేదని సత్యంబాబు తెలిపారు.
తాను అయేషాను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు విడుదలైన సీడీ.. పోలీసుల సృష్టేనని సత్యంబాబు ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో తన నిర్ధోషిత్వం వెల్లడైందని చెప్పారు.
హైకోర్టు తీర్పుతో తన నిర్దోషిత్వం వెల్లడైందని చెప్పారు. తన భవిష్యత్తు ఏంటన్నదానిపై ఇంకా నిర్ణయించుకుకోలేదని సత్యంబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications