మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్‌కోసం కాదు, బాబు పేరు లేదు

హైదరాబాద్: కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యవర్తిగా పీయూష్ వచ్చారా అనే ప్రశ్న ఉదయించింది. దీనిపై పీయూష్ స్పందించారు.

కేసీఆర్‌తో చర్చల సందర్భంగా విద్యుత్ పైనే చర్చించామని చెప్పారు. తాను తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డికి చెందిన ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యవర్తిగా రాలేదని చెప్పారు. అసలు కేసీఆర్‌తో భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావనే రాలేదన్నారు.

వచ్చే రెండేళ్లలో ఎల్ఈడీ బల్బులు వాడాలని తాను సూచించానని చెప్పారు. కేసీఆర్ ఏఢాది పాలన పైన తాము సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. తాను అన్ని రాష్ట్రాలకు నేనే మధ్యవర్తినే అన్నారు. నిధుల విషయంలో ఏ రాష్ట్రం పైనా పక్షపాతం చూపించడం లేదన్నారు.

I am not mediator between Chandrababu and KCR: Piyush

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదికే కోతలు లేని విద్యుత్ సరఫరాపై పీయూష్ గోయల్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని కేసీఆర్ కోరినట్లు చెప్పారు. నార్త్ గ్రిడ్ నుండి సౌత్ గ్రిడ్‌కు కారిడార్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ కోరారు.

కేసీఆర్ అడిగిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని గోయల్ చెప్పారు. రాష్ట్ర సౌర విద్యుత్ విధానం బాగుందని గోయల్ ప్రశంసించారు. 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడాన్ని అభినందించారు. ఒకే ఏడాది 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌కు సిద్ధం కావడం ఏ రాష్ట్రంలో లేదన్నారు.

బొగ్గు కేటాయింపు, ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణం పైన గోయల్‌కు సీఎం లేఖలు రాశారన్నారు. చత్తీస్ గఢ్‌తో మరో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకుంటామని గోయల్‌కు కేసీఆర్ చెప్పారు. ట్రాన్స్ మిషన్ల లైన్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కేసీఆర్ కోరారు. కాగా, గోయల్ అంతకుముందు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలతో విద్యుత్ గురించిన అంశమే మాట్లాడినట్లు గోయల్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+