Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబూ! మీ బానిసని కాదు, గల్లా జయదేవ్ రా: పవన్, ఆఫ్టరాల్ కాదు.. మురళీ మోహన్ మాటమిటి

పెనుమాక: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఆదివారం పెనుమాక గ్రామంలో పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు.

తనను అభివృద్ధికి ఆటంకం కలిగించే వారని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారని, అలాంటి వాటిని అయితే టిడిపికి ఎందుకు మద్దతిస్తానని చెప్పారు. ఆ మాటలు తనను బాధించాయన్నారు.

విశాఖలో హుధుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు తీరును మెచ్చుకున్నానని, అఫ్పుడు అభివృద్ధికి ఆటంకం అనిపించలేదా అని ప్రశ్నించారు. నేను మిత్రపక్షం అంటే బానిసను కాదని, తలూపేవాడిని కాదన్నారు.

బిజెపి - టిడిపికి మద్దతిచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేలు, పదవులు కోరుకున్నానా అని ప్రశ్నించారు. సీమాంధ్రులకు న్యాయం కావాలన్నారు. అటు చంద్రబాబు, ఇటు జగన్‌లలో చంద్రబాబుకు అనుభవం ఉందనే ఉద్దేశ్యంతోనే ఆయనకు మద్దతు పలికానని చెప్పారు.

I am not your slave: Pawan Kalyan to TDP

తన స్వార్థం కోసం మద్దతు పలకలేదన్నారు. టిడిపి మంత్రులు, నేతల ఆరోపణలు నన్ను బాధించాయన్నారు. నేను బిజెపి, టిడిపికి బానిసను అసలే కాదన్నారు. చంద్రబాబు సీఎం పదవిలో ఉన్నారని, రాజ్యాంగం సృష్టించిన పదవిలో ఉన్నప్పుడు పదేపదే తిట్టి.. అగౌరవపర్చడం తనకు ఇష్టం లేదన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలనే తాను మద్దతిచ్చానని చెప్పారు. ఆ రోజు మీకు మద్దతిస్తే అభివృద్ధి నిరోధకున్ని కాదని, ఇప్పుడు మాత్రం అభివృద్ధి నిరోధకుడ్నే కాదా అన్నారు.

మురళీ మోహన్ మాటేమిటి... రావెలకు కౌంటర్

మూడున్నర వేల ఎకరాలకు ఎందుకు ఇంత రాద్దాంతం అని టిడిపి మంత్రి రావెల కిషోర్ బాబు అడిగారని, మరి టిడిపి ఎంపీ మురళీ మోహన్ భూమిని నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఔటర్ రింగు రోడ్డు కోసం తీసుకుంటే ఆయన సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

మురళీ మోహన్‌కే అంత బాధ ఉంటే, సొంత భూమిలో పంటలు పండించే రైతులు ఎంతగా బాధపడతారన్నారు. తాను రెచ్చగొట్టేలా మాట్లాడం లేదని, దయచేసి టిడిపి అర్థం చేసుకోవాలన్నారు. రావెల.. కాన్షీరాంతో తిరిగిన వ్యక్తి అని, అలాంటప్పుడు ఎలా ఉండాలన్నారు. నా చిత్తశుద్ధిని శంకిస్తే సహించనన్నారు. మరో వ్యక్తిని చూస్తారన్నారు.

మంత్రి రావెల వ్యాఖ్యలు అవివేకమన్నారు. రావెల మాట్లాడుతూ.. ఆఫ్టరాల్ 3 ఎకరాల భూమి అన్నారని, మరి మురళీ మోహన్ ఆఫ్టరాల్ భూమి అని మీరు ఆ రోజు ఎందుకనుకోలేదన్నారు. ఒక ఎకరా భూమి పైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. దానిని ఆఫ్టరాల్ అంటే ఎలా అన్నారు. తప్పులను వేలెత్తి చూపితే కోపం వస్తుందా అన్నారు.

చంద్రబాబు ప్రపంచాన్ని ఆకర్షించిన నేత

చంద్రబాబు హైదరాబాదులో హైటెస్ సిటీ కట్టారని, హైదరాబాదును అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆకర్షించారని చెప్పారు. అలాంటి వ్యక్తికి రాజధాని భూమి విషయంలో మధ్యేమార్గం కనిపించడం లేదా అన్నారు. నేను టిడిపికి మనస్ఫూర్తిగా మద్దతిచ్చినప్పుడు నేను ఏ కులం వారికి గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా విషయమై... ఓ ప్రముఖ దినపత్రికలో తన కులం గురించి రాశారని, అది తనను బాధించిందన్నారు. తాను కులానికి, మతానికి వ్యతిరేకం అన్నారు. తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి హిందూ ఆలయంలో, మరో కూతురుకు చర్చిలో నామకరణం చేశానని చెప్పారు.

గల్లా జయదేవ్..

ఒకసారి గల్లా జయదేవ్ ఇక్కడకు వచ్చి రైతుల గోడు వినాలన్నారు. త్యాగాలు చేయాలని గల్లా జయదేవ్ అన్నారని, కానీ మనదాకా వస్తే ఆ బాధ తెలుస్తుందన్నారు. అలాగే, హైదరాబాదులో భూమి కోల్పోయిన మురళీ మోహన్ ఇక్కడకు వచ్చి రైతుల గోడు వినాలన్నారు.

నాకు ఆ స్థాయి లేదు

రాజధాని కోసం సలహాలు, సూచనలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వడం లేదని కొందరు అడుగుతున్నారని, కాని తనకు ఆ స్థాయి లేదన్నారు. తనకు అంత అనుభవం లేదన్నారు. లోక్‌సత్తా జెపి వంటి నాయకులను సలహాల కోసం అడగండన్నారు.

తనకు ఆ అనుభవం లేదన్నారు. చంద్రబాబుకు అందరూ సమానమేనని, అందుకే చంద్రబాబు భూసేకరణ చేయరని నమ్ముతున్నానని చెప్పారు. ఉండవల్లి గ్రామం తక్కువ కాదని, మీకు న్యాయం చంద్రబాబు చెస్తారని నమ్ముతున్నానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+