దగ్గుపాటి అంశం పరిశీలిస్తాం, నర్సారెడ్డిపై ఫిర్యాదు: బొత్స
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు కె కేశవరావుకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
తిరస్కరణ ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారంలో విధానాలు మార్చుకునే నైజం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదేనని బొత్స సత్యనారాయయణ ఆరోపించారు. అవినీతికి తావివ్వకూడదనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దించలేదని ఆయన చెప్పారు.

టి బిల్లుపైనే సిఎం భవిష్యత్: టిజి
తెలంగాణ బిల్లుపైనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్ ఆధారపడి ఉందని రాష్ట్రమంత్రి టిజి వెంకటేష్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమకు పదవుల కన్నా సమైక్య రాష్ట్రమే ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications