వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు,చిరంజీవి అందుకే దెబ్బతిన్నారు: చింతా మోహన్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయనగరం: పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. జనసేన పార్టీకి ఎన్నికల చిహ్నం లేదని ఆయన చెప్పారు. జనసేన చీఫ్ 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఈ సమయంలో మరో మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

రాజకీయాల్లో పెను మార్పులు, ఆయనొస్తున్నాడు: చింతా మోహన్ సంచలనంరాజకీయాల్లో పెను మార్పులు, ఆయనొస్తున్నాడు: చింతా మోహన్ సంచలనం

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ మేరకు రాజకీయపార్టీల మధ్య పోత్తుల్లో కూడ మార్పులు , చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్‌, వైఎస్ఆర్‌ కోసం రాజీవ్‌ను ఒప్పించా: వి.హెచ్.సంచలనంపవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్‌, వైఎస్ఆర్‌ కోసం రాజీవ్‌ను ఒప్పించా: వి.హెచ్.సంచలనం

2014 ఎన్నికల సమయంలో జనసేనను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో టిడిపి, బిజెపి కూటమికి పవన్ కళష్యాణ్ మద్దతు పలికారు. కానీ, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొంటారా అనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ విజయనగరంలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్

 పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు

పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు


పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు కూడ లేదని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. గతంలో కూడ పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని కొందరు టిడిపి ఎంపీలు వ్యాఖ్యానించారు.కానీ, తాజాగా పవన్ కళ్యాణ్ గురించి తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

పోలవరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేయాలి

పోలవరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేయాలి

పోలవరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేయించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని చింతా మోహన్ చెప్పారు.ఈ ప్రాజెక్టు‌ ఏపీ రాష్ట్రానికి వరప్రదాయిని లాంటిదన్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

1993లోనే చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని కోరా

1993లోనే చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని కోరా


1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని గతంలో చింతా మోహన్‌ వ్యాఖ్యానించారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు వెల్లడించారు. కానీ, 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా ప్రయోజనం లేకపోయిందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.

దళితులు, కాపులు రాజ్యాధికారం సాధించాలి

దళితులు, కాపులు రాజ్యాధికారం సాధించాలి

కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుండి రానున్న కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్‌ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు.

English summary
Chittoor former MP Chinta Mohan said that I don't know Pawan kalyan who is he , He spoke to media on Thursday at Vijayanagaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X