బాబుతో టైంవేస్ట్, ఆంధ్రోళ్లు బిడ్డలే: కేసీఆర్, జగన్‌కి బలం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, గంగాధర్‌లు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోనని కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన గురించి తలసాని, తీగలలే చెప్పారన్నారు.
సీఎం కార్యాలయం ముందే నీరు
హైదరాబాదును తానే నిర్మించానని చంద్రబాబు చెబితే, కుతుబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా అన్నారు. హైటెక్ సిటీని నిర్మించానని బాబు చెబుతారని, కానీ హైటెక్కో లో టెక్కో తనకు తెలియదని, చినుకు పడితే మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం ముందే నీరు నిలుస్తుందన్నారు. హైదరాబాదులో ఎక్కడ చూసినా గుంటలే ఉంటాయన్నారు. తాము మురికి వాడలు లేని హైదరాబాదును తీర్చిదిద్దుతామని చెప్పారు. భవిష్యత్తులో అద్భుతమైన హైదరాబాదు చూస్తారన్నారు.
ఇస్తాంబుల్ తరహాలో పాతబస్తీ

హైదరాబాదులో వేలకోట్ల భూములు మింగారన్నారు. భూబకాసురుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంచల్ గూడను ఎత్తేసి అక్కడ పేద ప్రజల కోసం విద్యాలయాలు ప్రారంభిస్తామన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో అధికారుల బృందం ఇస్తాంబుల్ వెళ్తుందన్నారు.
పేకాట క్లబ్బులు మూయిస్తే కోపమా?
పేకాట క్లబ్బులు మూసేస్తే రాద్దాంతం చేస్తున్నారని, అది తప్పా అని ప్రశ్నించారు. క్లబ్బులు మూసేయిస్తే ఆంధ్రా వాళఅలకు ఎందుకు బాధ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు.
ఆంధ్రోళ్లు మా బిడ్డలు, రేషన్ కార్డులూ..
తెరాస ప్రభుత్వం పేదల పక్షాన ఉందన్నారు. హైదరాబాదులో నివసించే మరాఠీలు, తమిళులు, మలయాళీల వలే ఇక్కడ నివసించే ఆంధ్రా వాళ్లు కూడా తమ బిడ్డలే అన్నారు. ఆంధ్రావాళ్లను బాధపెట్టే అవసరం మాకు లేదన్నారు. సెటిలర్లు మావాళ్లే అన్నారు. అర్హుల రేషన్ కార్డులు రద్దు చేయమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అన్నారు.
ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్
చంద్రబాబు మీకు సున్నం పెడుతారు తప్పితే అన్నం పెట్టరన్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాదుకు తరలి వస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగిందన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఆంధ్రా వాళ్లు వస్తే రెడ్ కార్పెట్ పరుస్తామన్నారు. అవసరమైతే వేల ఎకరాలు ఇచ్చి సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామన్నారు.
జగమొండిని, కొన్ని కఠిన నిర్ణయాలు
తాను జగమొండిని అని అందరికీ తెలుసునని, అందుకే తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షమంది చంద్రబాబులు వచ్చినా తాము అభివృద్ధి పట్టం వీడమన్నారు. తాను కొన్ని విషయాల్లో కఠినంగానే ఉంటున్నానని చెప్పారు. చరిత్రలో ఊహించని విధంగా, వరద నీరు రాని విధంగా, లండన్‌ను మించిన రోడ్లు హైదరాబాదులో నిర్మిస్తామన్నారు.
రుణమాఫీ చెయ్
తాను ఎన్నికల ప్రచారం సమయంలోనే మూడేళ్ల పాటు విద్యుత్ సమస్య ఉంటుందని చెప్పానని కేసీఆర్ అన్నారు. అలాగే, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేశామన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని కచ్చితంగా చెప్పామన్నారు. తాను అబద్దాలు ఆడనన్నారు. చంద్రబాబు మాత్రం రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదన్నారు.
ఒక్కో రైతుకు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు లక్ష పైసలు కూడా చేయలేదన్నారు. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిజాయితీపరుడే అయితే, రుణమాఫీ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని సవాల్ చేశారు. నీ రాష్ట్రంలో చేయకుండా ఇక్కడ అవాకులు చవాకులు పేలొద్దన్నారు. తమకు విద్యుత్ రాకుండా కుట్ర చేశాడన్నారు. ఇక్కడ తన తొత్తులతో బస్సుయాత్ర చేయించారని మండిపడ్డారు.
జగన్‌కు బలమిచ్చిన కేసీఆర్
తాను తన రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేశానని, నీ రాష్ట్రంలో నీవు చేశాక మాట్లాడాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బలం ఇచ్చినట్లయిందంటున్నారు. రుణమాఫీ పైన జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పార్టీకి మరింత బలమంటున్నారు.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications