మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేదు?.., ఎందుకంటే ఆ కెపాసిటీ నాకు లేదు: పవన్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీ ప్రయోజనాల కోసం జేఏసీ ఏర్పాటు ద్వారా ముందుకెళ్లాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిన్నటి మీడియా సమావేశంలో గట్టి ప్రశ్నలే ఎదురయ్యాయి. వాటిలో ఓ ప్రశ్నకు అవగాహన లేదంటూ దాటవేయగా.. ఓ ప్రశ్నకు మాత్రం నాకంత కెపాసిటీ లేదని సూటిగా చెప్పేశారు. ఇంతకీ ఏంటా ప్రశ్న..

  Pawan Kalyan Has Proposed Fact Finding Committee

  ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

  ఆ కెపాసిటీ నాకు లేకనే..:

  ఆ కెపాసిటీ నాకు లేకనే..:

  2014లో టీడీపీ-బీజేపీలను దగ్గరుండి గెలిపించిన మీరు.. ఎందుకని ఆ తర్వాత కేంద్రాన్ని కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలేకపోయారు? అన్న ప్రశ్న పవన్ కు మీడియా నుంచి ఎదురైంది. దీనికి బదులుగా మోడీని కలిసేంత కెపాసిటీ నాకు లేదని తేల్చిపారేశారు పవన్ కల్యాణ్.

  పవన్‌కు కౌంటర్..:

  పవన్‌కు కౌంటర్..:


  సీఎం చంద్రబాబు గారే 19,20సార్లు అపాయింట్‌మెంట్ కోరితే నిరాకరించినవారు.. నాకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇస్తారా? అని పవన్ ఎదురు ప్రశ్నించారు. దీనికి కౌంటర్‌గా.. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకుండా.. అపాయింట్‌మెంట్ ఇవ్వరని అలా ఎలా ఫిక్స్ అవుతారన్నట్టుగా మరో ప్రశ్న ఎదురైంది.

  నా అనుభవం సరిపోదనే..:

  నా అనుభవం సరిపోదనే..:

  'రాజకీయాల్లో నా స్థాయి, అనుభవం సరిపోదనే 2014లో టీడీపీ, బీజేపీ సభ్యులకు మద్దతు పలికాను. చట్టసభల్లో వాళ్లు దీని గురించి మాట్లాడాల్సి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వాళ్లు గట్టిగా నిలబడతారనే ఇన్నాళ్లు వేచి చూశాను.' అని పవన్ తనకెదురైన కౌంటర్‌ఇలా బదులిచ్చారు.

  ఆ సబ్జెక్ట్ నాకు లేదు:

  ఆ సబ్జెక్ట్ నాకు లేదు:


  ఇక కేంద్ర బడ్జెట్ గురించి మరియు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు నిధుల లెక్కల్ని ప్రస్తావించినప్పుడు.. ఆ సబ్జెక్ట్ గురించి తనకు అవగాహన లేదని పవన్ చెప్పడం గమనార్హం.

  అయితే తనకు తెలిసిన కొంతమంది ఆర్థికవేత్తలు, పాలసీ మేకర్స్, రాజ్యాంగ నిపుణులను సంప్రదించి వారిని జేఏసీలో భాగస్వామి చేయబోతున్నట్టు తెలిపారు. తద్వారా ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను వారు స్పష్టంగా విశ్లేషించగలుగుతారని పరోక్షంగా చెప్పారు.

  వాటిపై నో క్లారిటీ..:

  వాటిపై నో క్లారిటీ..:


  ఇకపోతే జేఏసీ ద్వారా అటు కేంద్రం చెప్పే నిధుల లెక్కల్ని, ప్రభుత్వం చెప్పే లెక్కల్ని రెండింటిని బేరీజు వేసి ఎవరిది తప్పన్నది తేలుస్తారని పవన్ చూచాయగా చెబుతున్నారు. అయితే ఎవరిదో తప్పే తెలిస్తే.. దాని ద్వారా సాధించేదేమిటి? అన్నది మరికొందరి ప్రశ్న. దానికంటూ ఒక డెడ్ లైన్.. తదుపరి కార్యచరణ విషయంలో ప్రస్తుతానికైతే పవన్ నుంచి క్లారిటీ రాలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On Sunday, while talking to media Janasena President Pawan Kalyan replied to a question that he does't have that much capacity to meet Prime Minister directly and discuss about state promises.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి