ఆ బాధ నాకు తెలుసు, పెద్దను కోల్పోతే..: జగన్
హైదరాబాద్: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర రావు ఆకస్మిక మృతి దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల ప్రభాకర రావు, శోభా నాగిరెడ్డి మరణాలకు ఆంధ్రప్రదేశ్ శానససభలో గురువారం సంతాప తీర్మానాలు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియదని, అయితే వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి తంగిరాల గురించి వేరే చెప్పనక్కరలేదని ఆయన అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తంగిరాల ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఆకాంక్షించారు.

తంగిరాల ప్రభాకర రావు రైతు పక్షపాతి అని, న్యాయవాదిగా కూడా ఎంతో మందికి సాయం చేశారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ప్రమాణ స్వీకారం చేయకుండా తంగిరాల చనిపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కోడెల శివప్రసాద రావు, ప్రతిపాటి పుల్లారావు, సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వర రావు తదితరులు తంగిరాల మృతికి సంతాపం ప్రకటిస్తూ మాట్లాడారు.












Click it and Unblock the Notifications