40ఏళ్ల రాజకీయ జీవితంలో లేనిది.. ఈ నాలుగేళ్లలో పొందాను: చంద్రబాబు

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగేళ్లలో పొందిన సంతృప్తి మునుపెన్నడూ లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు.

అమరావతి: తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగేళ్లలో పొందిన సంతృప్తి మునుపెన్నడూ లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు.

'ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని చంద్రబాబు అన్నారు. సోమవారం ఉపాధి హామీ నిధుల వినియోగంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కింద ఇప్పటివరకు రూ.16,572 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.

i felt more satisfaction in last four years says chandrababu naidu

ఈ పథకం కింద పలు నిర్మాణాలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 18వేల కి.మీ మేర రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం సిమెంట్ రహదారులు, పంచాయితీ భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్రీడా మైదానాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇక వైసీపీ నేతలపై మండిపడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2018నవంబర్ నాటికి 30లక్షల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. విభజన హామిలు ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ కేంద్రం వాటిపై సానుకూలంగానే ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+