వాజ్‌పేయ్ ఫోన్ చేసినా వెళ్ళలేదు, నా భార్య నాకు ధైర్యాన్ని ఇచ్చింది: చంద్రబాబు
అమరావతి: దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశానని, రాష్ట్రం కోసం ప్రధానమంత్రి పదవిని కూడ వదులుకొన్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదని చెప్పారు. రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి పదవులను కూడ వదులుకొన్నట్టు బాబు చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.తన మాటను మన్నించే అలెగ్జాండర్‌కు బదులుగా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్దిగా వాజ్‌పేయ్ నిర్ణయించారని చంద్రబాబునాయుడు చెప్పారు.
ఎమ్మెల్యేగా అడుగుపెట్టి చంద్రబాబునాయుడు 40 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆయనను అభినందిస్తూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు బాబును అభినందిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం గురించి అసెంబ్లీలో మాట్లాడారు.
కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో తాను కీలక పాత్ర పోషించానని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు చోటు చేసుకొన్న ఘటనలను బాబు ప్రస్తావించారు.

వాజ్‌పేయ్ ఫోన్ చేసినా వెళ్ళలేదు
ఎన్డీఏ 1 ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉన్న సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా అలెగ్జాండర్‌ను ఫైనల్ చేసినట్టుగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్‌పేయ్ తనకు ఫోన్ చేశారని చెప్పారు.అయితే ఈ విషయమై తనెకు అభ్యంతరాలున్నాయని వాజ్‌పేయ్‌కు చెప్పినట్టు బాబు చెప్పారు. అయితే రెండు రోజుల పాటు వాజ్‌పేయ్ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని పిలిచినా తాను వెళ్ళలేదని బాబు గుర్తు చేసుకొన్నారు. అయితే మళ్ళీ వాజ్‌పేయ్ పోన్ చేసి అడిగితే అబ్దుల్ కలాం పేరును రాష్ట్రపతి అభ్యర్ధిగా సూచించినట్టు చెప్పారు. కలాం అభ్యర్ధిత్వం పట్ల అందరూ కూడ మొగ్గు చూపారని వాజ్‌పేయ్ ఫోన్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీల అభిప్రాయాలను ఆనాడు వాజ్ పేయ్ గౌరవించారని బాబు ప్రస్తావించారు

కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం
దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో తాను కీలక పాత్ర పోషించినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్న కాలంలో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్‌తో కలిసి జాతీయ రాజకీయాల్లో పనిచేయడం తన జీవితంలో మరిచిపోలేనని చంద్రబాబునాయుడు చెప్పారు. దేవేగౌడ,గుజ్రాల్‌లను ప్రధానమంత్రిని చేసిన విషయాలను బాబు ప్రస్తావించారు.

అలిపిరి ఘటనలో నా భార్య ధైర్యాన్ని ఇచ్చింది
2003 అక్టోబర్ మాసంలో అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 23 క్లైమోర్ మైన్స్‌ను నక్సలైట్లు పేల్చారని ఆయన చెప్పారు. అయితే వెంకటేశ్వరస్వామి దయ వల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన చెప్పారు. ఆ సమయంలో కూడ తాను ఏ మాత్రం అధైర్య పడలేదని చెప్పారు. అలాంటి సమయంలో నా భార్య తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందన్నారు. తన కొడుకు కూడ ఈ విషయంలో తనకు ధైర్యం ఇచ్చాడని చెప్పారు.తనకు ఎలాంటి భయం లేదని బాబు చెప్పారు.

ప్రధానమంత్రి పదవిని వదులుకొన్నా
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలో తనను ప్రధానమంత్రిగా ఉండాలని చాలా మంది జాతీయ పార్టీల నేతలు కోరారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, రాష్ట్రమే ముఖ్యమని ప్రధానమంత్రి పదవిని వదులుకొన్నాని బాబు చెప్పారు.జాతీయ రాజకీయాల్లో ఉద్దండులతో తాను కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. వీరంతా కూడ తనను ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకొన్నారని చెప్పారు.కానీ, రాష్ట్రమే ముఖ్యమని ప్రధాని పదవిని వదులుకొన్నానని బాబు చెప్పారు. రాష్ట్రం కోసం కేంద్రంలో మంత్రి పదవులు కూడ తీసుకోలేదన్నారు. స్పీకర్ పదవికి బాలయోగికి నియమించుకొన్నామని బాబు గుర్తు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications