సోనియాకు భయపడను, బెయిల్‌కే జగన్: బాబు

ఏలూరు/హైదరాబాద్: యూపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాను భయపడే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆయనను సమైక్యాంధ్ర నినాదంతో రెండు చోట్ల విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు మాయలో పడవద్దని ఆయన వారికి హితవు చెప్పారు. విభజనకు పునాది వేసింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు.

Chandrababu Naidu

కొందరు బెయిల్ కోసం సోనియాకు భయపడి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతనే కేంద్రం విభజన ప్రక్రియపై ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల కోసం ప్రత్యేక కమిషన్ వేస్తామని తెలిపారు. వారి కోసం కమిషన్ ద్వారా ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మూడు నెలల్లో విభజన సాధ్యం కాదు: సోమిరెడ్డి

మూడు నెలల్లో రాష్ట్రాన్ని విభజించడం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ ఆదాయం ఎలా పంపిణీ చేస్తారో చెప్పకుండా ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ ఇష్ట ప్రకారం విభజన చేసి ఎన్నికలు పోవడమేంటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. 60ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రిలైనా.. తెలంగాణనే అభివృద్ధి చేశారని సోమిరెడ్డి చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీకి కట్టుబడి విభజన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గణాంకాలను, శ్రీకృష్ణ కమిటీ నివేదికను విస్మరించి కాకి లెక్కలతో విభజనపై ముందుకు వెళ్తారా అని ఆయన అడిగారు. రాష్ట్ర విభజన మూడు ప్రాంతాలవారికి ఆమోదయోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులు అయినా వారు తెలంగాణనే అభివృద్ధి చేశారని ఆయన అన్నారు

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత పార్లమెంటు సభ్యుడు వివేక్‌కు మతి భ్రమించిందని ఆయన అన్నారు. సీమాంధ్రులు టెంట్లు వేసుకోవాలనే వివేక్ మాటలు సరి కావని ఆయన అన్నారు. దళిత సిఎం ఆశతో వివేక్ తెరాసలో చేరారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+