చచ్చిపోదామనుకున్నా: న్యూడ్ ఫొటోల ఇష్యూపై తోట నర్సింహం
తూర్పుగోదావరి: ఫోటో మార్ఫింగ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఎంపీ తోట నరసింహం కంటతడి పెట్టారు. తనపై ఆరోపణలు వచ్చిన రాత్రి ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, తన ఆత్మహత్యను మీడియాకు అంకితం చేద్దామనుకున్నానని తోట వెల్లడించారు.
ఆ తర్వాత, పనికిమాలిన వ్యక్తి చేసిన ఆరోపణలకు ఆత్మహత్య చేసుకోవడం సరి కాదని విరమించుకున్నట్లు తోట తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సైకో లాయర్ ఆరోపణలపై తనను మీడియా కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ ఫిర్యాదు నిరాధారమని పోలీసులు ఎప్పుడో బాలల హక్కుల కమిషన్‌కు నివేదిక ఇచ్చారని ఎంపీ తోట నర్సింహం చెప్పుకొచ్చారు.
వారసత్వంగా వచ్చిన పెంకుటిల్లు, 6.30 ఎకరాల పొలం తప్ప అదనంగా పైసా సంపాదించలేదని తోట స్పష్టం చేశారు. ఫోటో మార్ఫింగ్‌పై రెండు నెలల క్రితం ఎంపీతో పాటు మరో వ్యక్తిపై లాయర్ రవికుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications