వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఇమేజ్‌తో.., అన్నయ్య గన్‌తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ చెప్పిన షాకింగ్

అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2017 కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అమెరికాలో కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

అమెరికాలో బిజీ.. అఖిలేష్ యాదవ్ సలహాదారుతో పవన్ కళ్యాణ్ భేటీ అమెరికాలో బిజీ.. అఖిలేష్ యాదవ్ సలహాదారుతో పవన్ కళ్యాణ్ భేటీ

తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు చాలా తేడా గుర్తించినట్లు తెలిపారు. నేటి రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయన్నారు. పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటన్నారు.

తాను చదువులో రాణించలేకపోవడంతో చాలా బాధపడ్డానని, ఒక దశలో అయితే డిప్రేషన్‌తో తన అన్నయ్య తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. సమాజాన్ని పరిశీలించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం తనకు స్వభావరీత్యా అలవడ్డాయన్నారు. నక్సలిజంలో కలుస్తానేమోనని కుటుంబ సభ్యులు అనుకున్నారన్నారు.

ఈ ఆలోచనలు తీవ్రంగా ఉండడంతో తాను నక్సలైట్లతో కలిపోతానని కుటుంబ సభ్యులు భయపడ్డారని పవన్ షాకింగ్ విషయాలు చెప్పారు. తనకు నటనలో మొదటిలో ఆసక్తి లేదని, తానొక యోగిని కావాలని అనుకునేవాడినన్నారు.

అయితే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలని తన అన్నయ్య చిరంజీవి.. ఇడియట్ అని తిట్టి చెప్పడంతో తాను మనసు మార్చుకున్నానని చెప్పారు. హార్వర్డ్ విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. మనసువిప్పి మాట్టాడారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

నాకున్న ఇమేజ్‌తో ప్రశ్నిస్తుంటే..

నాకున్న ఇమేజ్‌తో ప్రశ్నిస్తుంటే..

యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కొన్ని సినిమాలలో నటించిన తర్వాత బ్రేక్ తీసుకుంటానని, రాజకీయాల పైన దృష్టి సారిస్తానని చెప్పారు. తాను సినిమాలకు వ్యతిరేకం కాదని, సినిమాలు అంటే తనకు ఇష్టమే అన్నారు. సినిమా వల్ల తనకు ఇమేజ్ వచ్చిందని, దీంతో తాను పలు సమస్యల పైన ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాలలో స్పందన కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

సినిమాలు వదిలేద్దామనుకున్నా కానీ

సినిమాలు వదిలేద్దామనుకున్నా కానీ

ఏడు సినిమాలలో నటించిన అనంతరం తాను ఇండస్ట్రీని వదిలేయాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జానీ సినిమా హిట్ అయితే తాను సినిమాలు వదిలేసేవాడిని అని చెప్పారు. కానీ అది ఫ్లాప్ అయిందన్నారు.

డబ్బు కావాలి కానీ..

డబ్బు కావాలి కానీ..

నేను జీవించేందుకు తనకు డబ్బులు అవసరమని, కానీ డబ్బులే తనకు ముఖ్యం కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను డబ్బులు సంపాదించేందుకే సినిమా ఇండస్ట్రీలో లేనని చెప్పారు. తన సొంత డబ్బును జనసేన పార్టీ కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు.

విరాళాలు ఇప్పుడు కాదు..

విరాళాలు ఇప్పుడు కాదు..

ప్రస్తుతం చాలామంది తన పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని, కానీ తాను ప్రస్తుతం తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు అవసరం అయినప్పుడు తీసుకుంటానని చెప్పారు. విరాళాలు తీసుకుంటే పారదర్శకత అవసరమని చెప్పారు. పార్టీకి వచ్చే ఫండ్‌ను మిస్ యూజ్ చేయవద్దన్నారు.

నాయకుల బంధువులు కాదు.. మీరు రండి

నాయకుల బంధువులు కాదు.. మీరు రండి

భారత దేశంలో రాజకీయ నాయకుల కొడుకులు, మనవళ్లు వారసత్వంగా వస్తుంటారని, తాము యూత్ అని చెబుతుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. బాగా చదువుకున్న, తెలివై యువత రాజకీయాల్లో చేరాలన్నారు. రాజకీయాలకు యువత అవసరం ఉందని చెప్పారు.

English summary
Pawan Kalyan is currently in the SA to address students at Harvard University to reveal a few of his ideas about films and politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X