నా సోదరుడిని ఓడించాడు, వైఎస్ఆర్‌పై పోటీ, ముందే చెప్పా: కందుల రాజమోహన్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: తన సోదరుడిని ఓడించాడనే కోపంతోనే వైఎస్ఆర్‌పై పోటీ చేస్తానని ముందే అతనికి చెప్పి 1996 ఎన్నికల్లో వైఎస్ పై పోటీ చేసినట్టు బిజెపి నేత కందుల రాజమోహన్ రెడ్డి చెప్పారు. కడపలో తన సోదరుడు శివానందరెడ్డిని ఓడించినందునే వైఎస్‌పై పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.

కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో కందుల రాజమోహన్ రెడ్డి చెప్పారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కూడ తమ గ్రామంలో తన అభ్యర్థిని గెలిపించుకొనేందుకు వైఎస్ వచ్చిన సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ పై పోటీ చేస్తానని తేల్చి చెప్పానని రాజమోహన్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కందుల రాజమోహన్‌రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. కడప జిల్లాలో ఆనాడు చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను ఆయన ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

వైఎస్‌పై పోటీ చేస్తానని ముందే చెప్పా

వైఎస్‌పై పోటీ చేస్తానని ముందే చెప్పా

వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై పోటీ చేస్తానని ముందుగానే ఆయనకు చెప్పానని కందుల రాజమోహన్ రెడ్డి చెప్పారు. 1996 ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డి టిడిపి అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేశారు.అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ పై పోటీ చేస్తే గట్టిపోటీ ఇవ్వగలననే నమ్మకం, ధైర్యం నాకు ఉండేదన్నారు.అయితే ఈ విషయాన్ని వైఎస్‌కు ముందే చెప్పానని రాజమోహన్‌ రెడ్డి గుర్తుకు చేసుకొన్నారు.తమ స్వగ్రామానికి వైఎస్ వచ్చిన సమయంలో ఈ విషయాన్ని తాను ప్రస్తావించినట్టు ఆయన చెప్పారు.

కడపలో నా సోదరుడిని ఓడించాడు

కడపలో నా సోదరుడిని ఓడించాడు

1994లో మా సోదరుడు శివానందరెడ్డిని ఓడించేందుకు ప్రయత్నించారు. ఆ రోజున టీడీపీ అభ్యర్థి అయిన ఖలీల్ భాషా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సపోర్టు చేశారు. దీంతో తన సోదరుడు కందుల శివానందరెడ్డి ఓటమిపాలయ్యారని ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు. దీంతో వైఎస్‌పై పోటీ చేయాలని భావించానని చెప్పారు. వైఎస్ టిడిపి అభ్యర్థికి మద్దతివ్వకపోతే కడపలో తన సోదరుడు ఆనాడు విజయం సాధించేవాడని ఆయన అభిప్రాయపడ్డారు.

1991లో వైఎస్‌కు వచ్చిన మెజారిటీపై ఇలా.

1991లో వైఎస్‌కు వచ్చిన మెజారిటీపై ఇలా.

1991లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుండి ఘన విజయం సాధించారు.ఆ ఎన్నికల్లో నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలపై తమకు ఉన్న సమాచారం మేరకు ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఫలితం మరోలా ఉంటుందన్నారు.

నా స్వగ్రామంలో కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిని నిలబెట్టాడు

నా స్వగ్రామంలో కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిని నిలబెట్టాడు


మా ఊరు వెలమారిపల్లి పంచాయతీ ఎన్నికల్లో మా మిత్రుడు పంచాయతి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ వైపు నుంచి ఇంకో అభ్యర్థిని పోటీగా ఉంచారు. వైఎస్ఆర్ వాళ్ల కుటుంబసభ్యులు మా ఊరు వచ్చారు.అదే రోజున వైఎస్‌ఆర్‌పై పోటీ చేస్తానని నేరుగా ఆయనకే చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When my brother Shivandha Reddy defeated in Kadapa elections in 1994, I decided to contest from Kadapa parliament seat said BJP leader Kandula Rajamohan Reddy. A Telugu Channel interviewed him on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి