వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు మా ఇంటికి వస్తానన్నారు, కానీ: కోట్ల, ‘బాబు జీవితమే అక్రమం’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం తమ ఇంటికి వస్తున్నట్లు సమాచారం అందించారని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. అయితే, ఆయన మాత్రం రాలేదని కోట్ల చెప్పారు.

బాబుకు ఎప్పుడైనా ఆహ్వానమే..

బాబుకు ఎప్పుడైనా ఆహ్వానమే..

చంద్రబాబు తమ ఇంటికి ఎప్పుడొచ్చినా మన:స్ఫూర్తిగా ఆహ్వానిస్తామని చెప్పారు. మరో వైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పారు.

పార్టీ మారే ప్రసక్తే లేదు..

పార్టీ మారే ప్రసక్తే లేదు..

తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాలను వదిలి, వ్యవసాయం చేసుకుంటానే తప్ప.. కాంగ్రెస్ పార్టీని వదలనని చెప్పారు. అంతేగాక, రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు.

బాబును ఎద్దేవా చేసిన జోగి రమేష్

బాబును ఎద్దేవా చేసిన జోగి రమేష్

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శల వర్షం కురిపించారు. నది పక్కన అక్రమ నివాసంలో నివసిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు నదుల పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. సేవ్ రివర్స్ పేరుతో బాబు అన్ని రివర్స్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

సినీ దర్శకుడికి ఏం తెలుస్తుంది?

సినీ దర్శకుడికి ఏం తెలుస్తుంది?

చంద్రబాబు నిజ జీవితమే అక్రమమని, రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కేవలం కమీషన్ల కోసమే ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టారని జోగి రమేష్ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి సినిమా దర్శకుల సహకారం కావాలా? అని సీఎం చంద్రబాబును జోగి ప్రశ్నించారు. నిర్మాణంపై ఇంజినీర్లకు ఎక్కువగా అవగాహన ఉంటుందని, దర్శకులకు డిజైన్లు ఎలా తెలుస్తాయని జోగి ాన్నారు.

English summary
Former union minister Kotla Surya Prakash Reddy said that he will always welcome Andhra Pradesh CM Chandrababu Naidu to my home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X