నాకిచ్చే గౌరవం ఇదేనా, దూతను పంపారు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: చల్లా

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: నామినేటేడ్ పదవుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని ఇచ్చి తనకు రీజినల్ ఛైర్మెన్ పదవిని అప్పగించడం పట్ల చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పార్టీ మారేందుకు చల్లా రామకృష్ణారెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

2014 ఎన్నికల ముందు చల్లా రామకృష్ణారెడ్డి టిడిపిలో చేరారు. అయితే ఆయనకు ఆ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ టిక్కెట్టును కేటాయిస్తానని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారని సమాచారం.

అయితే అనేక కారణాలతో చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. ఇటీవల ఎమ్మెల్సీ టిక్కెట్టును కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కెఈ ప్రభాకర్‌కు చంద్రబాబునాయుడు ఇచ్చారు. చివరినిమిషం వరకు చల్లా రామకృష్ణారెడ్డికే పదవి దక్కుతోందని భావించినా దక్కలేదు. చల్లా రామకృష్ణారెడ్డి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు.

చల్లా రామకృష్ణారెడ్డి అసంతృప్తి

చల్లా రామకృష్ణారెడ్డి అసంతృప్తి

నామినేటేడ్ పదవుల కేటాయింపుల విషయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టి, తనకు రీజినల్ ఛైర్మెన్ పదవిని ఇవ్వడంపై చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పదవిని తీసుకొనేందుకు ఆయన నిరాసక్తతను కనబర్చారు. ఈ విషయమై తనకు చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

తనకు ఇచ్చే గౌరవం ఇదేనా

తనకు ఇచ్చే గౌరవం ఇదేనా

ఎన్టీఆర్ హయంలో తాను డోన్ నుండి పోటీ చేసి కెఈ కృష్ణమూర్తి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను ఢీకొట్టిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి తనకు అన్యాయం చేశారని చెప్పారు. అంతేకాదు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాను టిడిపికి ఎమ్మెల్యే సీటును కానుకగా ఇస్తే తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

సీఎంవో నుండి ఫోన్లు వచ్చాయి

సీఎంవో నుండి ఫోన్లు వచ్చాయి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయం నుండి తనకు ఫోన్లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అయితే తాను ఆ ఫోన్లకు ఎంతకు స్పందించకపోవడంతో తన వద్దకు చంద్రబాబునాయుడు దూతను పంపారని చెప్పారు. అయితే తన అభిప్రాయాన్ని సీఎం దూతకు చెప్పానని ఆయన చెప్పారు.

త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా

త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా

తన తమ్ముడి కొడుకు వివాహం త్వరలోనే ఉందని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వివాహం తర్వాత ముఖ్యనాయకులు, అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పార్టీ మారుతారా అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. అయితే తన అనుచరుల సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MLA challa Ramakrishna Reddy said that I will announce my future plan soon. He spoke to media at his residence.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X