ప్రత్యర్థులొద్దు, ఇక రియల్ టైం పాలిటిక్స్, జగన్‌కు దిమ్మతిరిగింది: బాబు, 20 ప్రశ్నలు

పార్టీ నేతలు ఎవరు కూడా కోరి ప్రత్యర్థులను పెంచుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హితవు పలికారు. ప్రభుత్వం చేస్తున్నదే ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.

Recommended Video

    Chandrababu Ready to do real time politics ఇక రియల్ టైం పాలిటిక్స్ జగన్‌కు దిమ్మతిరిగింది

    అమరావతి: పార్టీ నేతలు ఎవరు కూడా కోరి ప్రత్యర్థులను పెంచుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హితవు పలికారు. ప్రభుత్వం చేస్తున్నదే ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.

    చదవండి: షాక్: మోడీ కేబినెట్లోకి పురంధేశ్వరి, వెదిరే శ్రీరామ్‌ను అడ్డుకున్న బాబు, సుజన చక్రం, అందుకే?

    నేతల మనస్తత్వాల విశ్లేషణకు 20 ప్రశ్నలు

    నేతల మనస్తత్వాల విశ్లేషణకు 20 ప్రశ్నలు

    ఈ సందర్భంగా నేతల మనస్తత్వాల విశ్లేషణకు 20 ప్రశ్నల జాబితాను పార్టీ నేతలకు అందించారు. నేతలు బలం పెంచుకొని, బలహీనతలను సరిదిద్దుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.

    ఇక రియల్ టైమ్ పాలిటిక్స్

    ఇక రియల్ టైమ్ పాలిటిక్స్

    ఇప్పటిదాకా రియల్ టైం గవర్నెన్స్‌ చేశానని, ఇకపై రియల్ టైం పాలిటిక్స్‌ చేస్తానని చంద్రబాబు అన్నారు. విజయవాడలో పార్టీ రెండో రోజు వర్క్ షాప్‌ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించాలన్నారు.

    అబద్దాలు చెప్పకండి, మళ్లీ ఆ పరిస్థితి రావొద్దు

    అబద్దాలు చెప్పకండి, మళ్లీ ఆ పరిస్థితి రావొద్దు

    మన ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు నేతలకు చెప్పారు. అదే సమయంలో కాకినాడ, నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ సర్వేలను, టిడిపి నేతలు ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు పోల్చి చూశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని, మళ్లీ ఆ పరిస్థితులు రావొద్దన్నారు.

    వైసిపికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాం

    వైసిపికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాం

    నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసిపికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చామని చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపిపై నమ్మకం పెట్టుకున్న ప్రజలు, మొన్న జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లోనూ దాన్ని స్పష్టం చేశారన్నారు.

    జగన్ లాంటి వాళ్లు లీడర్ అయితే ఇంతే

    జగన్ లాంటి వాళ్లు లీడర్ అయితే ఇంతే

    విజయవాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గౌతం రెడ్డి, వంగవీటి రాధాకృష్ణల వివాదాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జగన్‌ లాంటి నాయకుడు ఉంటే పార్టీ పరిస్థితి అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.

    నవ్వులు పూయించిన అశోక్, యనమల

    నవ్వులు పూయించిన అశోక్, యనమల

    టిడిపి వర్క్ షాప్ లో మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సరదా వ్యాఖ్యలతో నవ్వులు విరబూశాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మీటింగ్ హాల్లోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆయన్ని యనమల కోరారు.

    రూ.200 నోటు ఇటీవలే చూశానని అశోక్

    రూ.200 నోటు ఇటీవలే చూశానని అశోక్

    దీంతో, తన వద్ద డబ్బు లేదని, రూ.200 నోటును ఇటీవలే చూశానని అశోక్ గజపతి రాజు సమాధానమిచ్చారు. ఇలాంటి నోట్లు ఎన్ని ఉంటే అన్నీ రాష్ట్రానికి ఇచ్చేయాలని యనమల వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి. కాగా, కొత్తగా విడుదలైన రూ.200 నోటును టిడిపి నేతలందరూ ఆసక్తిగా తిలకించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+