బాధ్యత నెరవేరుస్తా, వాటిని పట్టించుకోను: సుజనా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా తన బాధ్యత నెరవేరుస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రం నిధుల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫాల్ అప్ చేశారని చెప్పారు.
చెప్పినదానికంటే రూ. 240కోట్లు అదనంగా రాష్ట్రానికి నిధులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది తన విజయం కాదని, ఎంపీలందరి విజయమని సుజనా చౌదరి చెప్పారు. భారతీయ జనతా పార్టీతో మైత్రి ప్రశాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని సుజనా చౌదరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సహా నేతలందరూ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. తనపై కొన్ని పత్రికల ప్రతికూల కథనాలు పట్టించుకోనని తెలిపారు.












Click it and Unblock the Notifications