వైయస్ జగన్‌తోనే ఉంటా, పార్టీ మారను: ఎంపి గీత
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని, అవన్నీ ఊహా గానాలేనని విశాఖపట్నం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉండి పార్టీకి, ప్రజలకు సేవ చేస్తానన్నారు.
ఆదివారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఏడాదిన్నర క్రితమే అరకు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయమని వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని ఈ సందర్బంగా ఆమె మరోమారు గుర్తు చేశారు.

పార్టీలో ఉండి చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఎస్టీ పార్లమెంటు సభ్యురాలిని తానేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడతానని వార్తలు రావడం బాధాకరమని గీత అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక వీడిన నేపథ్యంలో కొత్తపల్లి గీత పేరు కూడా ముందుకు వచ్చింది.
ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరగా, తాను తెలుగుదేశం పార్టీ అసోసియెటెడ్ సభ్యురాలిగా కొనసాగుతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక చెప్పారు.












Click it and Unblock the Notifications