బాబుని కలవను, రాజకీయాల నుంచి తప్పుకుంటా: భూమా, సీఎంకు దూరం చేయాలనే
కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య మాటల దాడి జరుగుతోంది. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన నెల రోజుల్లోనే కర్నూలు జిల్లాలో వర్గపోరు ఆసక్తికరంగా మారింది. ఇది చివరకు ఫ్యాక్షన్ దాడులకు దారి తీస్తోందని అంటున్నారు.
శిల్పా అనుచరుడు తులసి రెడ్డి పైన భూమా అనుచరులు దాడి చేశారని శిల్పా సోదరులు ఆరోపిస్తున్నారు. దీనిపై భూమా నాగిరెడ్డి మంగళవారం నాడు స్పందించారు. శిల్పా వర్గీయుడు తులసి రెడ్డి పైన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
స్థానికంగా తులసి రెడ్డి పంచాయతీలు చేస్తుంటారని చెప్పారు. తులసి రెడ్డి పైన దాడికి గ్రామ కక్షలే కారణం కావొచ్చునని చెప్పారు. తనకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనని స్పష్టం చేశారు.
తమ వర్గం వ్యక్తి పైన భూమా నాగిరెడ్డి వర్గం దాడి చేసిందని ఆరోపిస్తున్న శిల్పా సోదరులు.. చంద్రబాబును కలిశారు. కానీ తాను చంద్రబాబును కలవనని చెప్పడం ఆసక్తికర విషయమేనని చెప్పవచ్చు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, దీని విషయంలో చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీలోకి అందర్నీ కలుపుకొని పోయేందుకే వచ్చానని చెప్పారు. తాను గొడవల కోసం రాలేదన్నారు. తాను టిడిపిలోకి రావడం కొంతమందికి సంతోషాన్ని మరికొంతమందికి ఇబ్బందిని కలిగించిందన్నారు. శిల్పా తన మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నారు.

గ్రామ కక్షల వల్లే ఈ గొడవ జరిగి ఉండవచ్చునని ఎఫ్ఐఆర్‌లో రాశారని చెప్పారు. ప్రభుత్వానికి నేనే లెటర్ ఇవ్వబోతున్నానని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేయాలని సీఎంను కోరుతానని చెప్పారు. తనను టిడిపికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నేను వైసిపిలో ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్ విషయంలో తన పైన మూడు కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు టిడిపిలోకి వచ్చీ రాగానే నేను ఇలా చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. ఇసుక మాఫియా పైన తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను స్వతహాగా రాజకీయ నాయకుడినే కానీ, వ్యాపారస్తుడిని కాదన్నారు.
ఇసుక తవ్వకాలతో డబ్బులు వస్తాయా అనే విషయం తనకు ఇటీవలి వరకు తెలియదన్నారు. నేను గతంలో ప్రధాని మీద పోటీ చేశానని చెప్పారు. తన రాకతో వారు అభధ్రతగా ఫీల్ అవుతున్నారన్నారు.
టిడిపిలో చంద్రబాబుతో తనకు గ్యాప్ తీసుకు రావాలని కుట్ర చేస్తున్నారన్నారు. అభియోగాలు సరికాదన్నారు. తన పైన ఇలా అభియాగాలు చేయడం కూడా తనకు మంచిదే అన్నారు. ఇది తనకు ప్లస్ అవుతుందని, తన గురించి ప్రజలకు తెలుస్తుందన్నారు.
అంతకుముందు, శిల్పా సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమ వర్గీయుడి పైన దాడి అంశంలో భూమా నాగిరెడ్డి హస్తం ఉందని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి.. భూమా పైన మండిపడ్డారు.
భూమా వల్లే తనకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. భూమా ఫ్యామిలీ చేరినప్పటి నుంచే జిల్లా రాజకీయాలలో గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. భూమా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవ జరగలేదని చంద్రబాబుకు వివరించానని చెప్పారు. భూమా అక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. తమ సోదరులు టిడిపిలో లేకుండా చేయాలని భూమా చూస్తున్నారన్నారు.
జిల్లాలో కెఈ కృష్ణమూర్తితో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. భూమాతోనే ఇబ్బందులు అన్నారు. భూమా తీరు ఇలాగే ఉంటే కలిసి పని చేయడం కష్టమన్నారు. టిడిపిలో చేరాక భూమా తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. భూమా చేరికతో ఇబ్బందులు ఉంటాయని తాను ముందే చంద్రబాబుకు చెప్పానని తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications