కెసిఆర్‌కి చిక్కు: హామీతో గౌడ్ రిజైన్, ఇబ్రహీం వార్నింగ్

సంఘ కార్యవర్గ అత్యవసర సమావేశం శనివారం జరిగింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలంటూ శ్రీనివాస్ గౌడ్‌ను సభ్యులు ఈ సందర్భంగా ముక్తకంఠంతో కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారు. ఇక, రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశం ఆయనకు ఇప్పటికే ఉండడంతో కొద్ది రోజుల కిందటే ఆయన తన ఉద్యోగానికి (జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్) రాజీనామా చేశారు. దానిని ఆమోదించాలంటూ సోమవారం ఆయన మునిసిపల్ శాఖాధిపతిని కలిసి కోరనున్నారు.
కాగా, అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేయాల్సిందిగా కెసిఆర్ తనను కోరినట్లు పత్రికల్లో వచ్చిందని, అది నూటికి నూరు శాతం నిజమన్నారు. తెలంగాణ ఉద్యోగులు, అధికారుల ఐకాస కూడా తాను రాజకీయాల్లోకి రావాలని చెప్పిందని, మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలని స్పష్టం చేశాయన్నారు. కెసిఆర్ మాటలపై గౌరవంతో రాజకీయ ప్రవేశం చేయాలని తమ సంఘం చెప్పిందన్నారు. తాను పోటీ చేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించిందన్నారు. అందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు.
తెరాసలో మహబూబ్ నగర్ చిచ్చు
శ్రీనివాస్ గౌడ్ తెరాస నుండి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో తెరాస సీనియర్ నేత ఇబ్రహీం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీకి ఎంతో సేవ చేశానని, శ్రీనివాస్ గౌడ్ వేరే నియోజకవర్గం ఎంచుకుంటే మంచిదన్నారు. లేదంటే తాను చేయాల్సింది చేస్తానని హెచ్చరించారు. శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్ కేటాయింపు వార్తలు.. తెరాసలో లుకలుకల నేపథ్యంలో కెసిఆర్ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications