జగన్! నేను వనజాక్షిని కొట్టానా: చింతమనేని సవాల్, మూడేళ్లుగా అక్కడే: కళా
ఎమ్మార్వో వనజాక్షిపై తాను చేయి చేసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం సవాల్ చేశారు.
అమరావతి: ఎమ్మార్వో వనజాక్షిపై తాను చేయి చేసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం సవాల్ చేశారు.
తాను వనజాక్షిని కొట్టినట్లు కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వనజాక్షి విషయంలో తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఓ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అవినీతి కేసుల్లో మునిగిపోయిన వైసిపి అధినేత జగన్, ఆయన పార్టీ నేతలు తన గురించి మాట్లాడటమా అని విమర్శించారు.

అవినీతి సామ్రాజ్యానికి జగనే అధిపతి అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అత్యంత అవినీతికి పాల్పడ్డ వ్యక్తి జగన్ అని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే జగన్‌కు ప్రతిపక్షనేత హోదా కూడా ఉండదన్నారు. వనజాక్షి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
జగన్ తెలుసుకోవాలి: కళా వెంకట్రావు
చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్ వెళ్లడంపై జగన్ అసెంబ్లీలో విమర్శించారు. దీనిపై టిడిపి నేత కళా వెంకట్రావు స్పందించారు. చంద్రబాబు తన మనవడి పుట్టిన రోజుకు వెళ్లినా విమర్శలు విడ్డూరమన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరికంటే ముందే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. జగన్ మాత్రం అసెంబ్లీ అయిపోగానే హైదరాబాద్ వెళ్లిపోవాలనుకుంటారన్నారు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్నారన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడేందుకు వైసిపి, టిడిపి సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీ పడ్డారు.
టిడిపి సభ్యురాలు మాట్లాడుతుండగా వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వచ్చారు. ఈశ్వరి మాట్లాడుతుండగా టిడిపి సభ్యులు కొందరు మైక్ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి పీతల సుజాత మైక్ ఇవ్వాల్సిందిగా కోరినా ఆమె పట్టించుకోలేదు. టిడిపి సభ్యులు మైకులు తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నించడంతో వైసిపి సభ్యులు అభ్యంతరం తెలిపారు.
దీంతో మార్షల్స్ అక్కడకు చేరుకుని వారిని వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తమను సభతో పాటు బయటా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కండ బలంతో తమపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications