వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీకటి ఒప్పందాల గుట్టు విప్పుతా: లగడపాటి వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తమ రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత చీకటి ఒప్పందాలన్నింటి గుట్టును తాను విప్పుతానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం ప్రకటించారు. తనకు తెలిసిన విషయాల గురించి పూర్తిస్థాయిలో మనసు విప్పి మాట్లాడుతానని ప్రకటించారు. స్పీకర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎంపీలం తమ రాజీనామాలను ఆమోదించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఒకవేళ స్పీకర్ అపాయింటుమెంట్ ఇవ్వకపోతే ఆమె ఎక్కడుంటే అక్కడకే వెళ్లి ఆమోదించుకోవాలని తీర్మానించుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన కోసం వైయస్సార్ కాంగ్రెసు-కాంగ్రెసు కుమ్మక్కు అయినట్లు వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నిస్తే... రకరకాల ఆరోపణలు, కథనాలు వస్తున్నాయని, తాను రాజీనామా ఆమోదించుకున్న మరుక్షణం అన్నీ చెబుతానన్నారు.

దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న వారిని ఫణంగా పెట్టి భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్‌తో కుమ్మక్కైనట్లు పార్టీ వారు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా.. తన మనసులో మాట, తనకు తెలిసిన విషయాలు చెబుతానని, చీకటి ఒప్పందాలు, తెరచాటు ఒప్పందాలు బయటపెడతానన్నారు.

తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి రాకముందు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వారు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్లేనని లగడపాటి అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గుతుందన్నారు.య అందువల్ల సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయవద్దన్నారు.

చాటుమాటున ఏం జరిగినా ప్రజలకు తెలుస్తుందని, చాటుగా జరిగింది ఎవ్వరికీ అర్థం కాదనుకుంటే పొరపాటేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంపీలుగా తాము రాజీనామాలు చేసి జాతీయ పార్టీలకు అవగాహన తీసుకు వచ్చామని, ఆంటోని కమిటీ కూడా వేయించగలిగామని, ఆ తర్వాత సభా కార్యకలాపాలు అడ్డుకొని సస్పెండ్ అయ్యామని, అందవల్ల ఇప్పుడు తమ సభ్యత్వాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal on Thursday said he will reveal facts after his resignation approved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X