వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చకుంటే ఓటేయను: టిపై అధిష్టానానికి పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు సమగ్రంగా లేదని, బిల్లులో మార్పులు చేయకుంటే తాను పార్లమెంటులో దానికి మద్దతివ్వనని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం అన్నారు. ఆమె విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.

రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి రాజధాని అసాధ్యమన్నారు. సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు అడిగిన ప్రతిపాదనలకు బిల్లులో ఎలాంటి స్పష్టమైన హామీలు లేవన్నారు. సమస్యలను పరిష్కరించాకే విభజన చేయాలన్నారు. సీమాంధ్రలో నెలకొన్న పలు సమస్యల పైన తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లకు లేఖలు రాశానని చెప్పారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజన చేయాలన్నారు.

వ్యతిరేకతపై రఘువీరా

పదేళ్ల పాటు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండటంతో ప్రజా వ్యతిరేకత సహజమని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నర్సింహా రావు 9వ వర్ధంతి సందర్భంగా అనంతపురం కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

పివి నర్సింహా రావు దేశానికి, కాంగ్రెసు పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. ఐదేళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపినప్పటికీ 1998లో ఆయనకు కనీసం పార్లమెంటు టిక్కెట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 Union Minister Daggubati Purandeswari on Monday said in Vishakapatnam that she will oppose present Telangana Draft Bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X