ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: అదృశ్యమైన ఏఎన్ 32 విమానం జాడ కనుగొనే ప్రయత్నంలో కొంత పురోగతి కనిపించింది. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన ఎయిర్ క్రాప్ట్ సముద్రంలో రెండు నారింజరంగు డ్రమ్ములను గుర్తించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఐదు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయల్దేరిన భారత వాయుసేన విమానం (ఏఎన్‌-32) తప్పిపోయిన సంగత తెలిసిందే. అప్పటి నుంచి విమానం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న క్రమంలో విమానం కూలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఈ క్రమంలో నారింజరంగులో ఉన్న రెండు డ్రమ్ములను బంగాళాఖాతంలో ఎయిర్‌ఫోర్స్‌, నేవీ సిబ్బంది గుర్తించారు. ఈ డ్రమ్ములు కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా అధికారులు భావిస్తున్నారు. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు డ్రమ్ములు తేలియాడుతూ ఉండటాన్ని అధికారులు గుర్తించారు.

ఈ నారింజ డ్రమ్ములు ఏఎన్-32 విమానానికి చెందినవనే చెబుతున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ డ్రమ్ములు ఆ విమానంకు చెందినవిని అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

మరోవైపు విమానం విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న ప్రాంతంలో గాలింపు కోసం మారిష‌స్ నుంచి తెప్పించిన‌ స్పెష‌ల్ షిప్ ‘సాగ‌ర్ నిధి'తో అధికారులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. అత్యాధునిక ప‌రికాల‌తో రూపొందించిన‌ సాగ‌ర్ నిధి స‌ముద్రంలోని 6 కిలో మీటర్ల లోతున ఉన్న వ‌స్తువుల‌ను గుర్తించగ‌ల‌ద‌ు.

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

అంతేకాదు ధ్వ‌ని త‌రంగాలను సముద్రం లోపలకి పంపించి తద్వారా వ‌స్తువులను ప‌సిగ‌డుతుందని అధికారులు చెబుతున్నారు. విమాన ఆచూకీ కోసం భారతీయ నేవీకి చెందిన జ‌లాంత‌ర్గాములను కూడా సెర్చ్ ఆపరేషన్‌‌లో వినియోగిస్తున్నారు.

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

మరోవైపు అదృశ్యమైన విమానం ఆచూకీ ఎప్పటికీ తెలియకపోవచ్చన్న సంకేతాలను వెలువరుస్తూ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విమానం అదృశ్యంపై ఇప్పటివరకూ ఎన్నో సంకేతాలు అందాయని, అవన్నీ కూడా చెడు సంకేతాలనే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు.

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఈ అంశంపై తుది నిర్ణయానికి వచ్చే ముందు అన్ని విషయాలనూ బేరీజు వేసుకోవాల్సి వుందని, కొన్ని తప్పుడు సంకేతాలు కూడా అందాయని, ఇప్పటికిప్పుడు తుది నిర్ణయాన్ని ప్రకటించలేమని చెప్పారు. మారిషస్ నుంచి వచ్చిన 'సాగరనిధి' సేవలను అందుకోవాలా? వద్దా? అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఏఎన్-32 విమాన జాడలో పురోగతి: రెండు నారింజ రంగు డ్రమ్ముల గుర్తింపు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Navy Aircraft has detected two orange drums in the Bay of Bengal, reported Times Now, during its search and rescue operations of the Antonov AN-32 aircraft of the IAF that went missing on Friday, over the Bay of Bengal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X