వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్ కావాలనుకొని 9 నెలలకే ఎమ్మెల్యే అయ్యా : అనిత

ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు, తాను కూడ రాజకీయాల్లో చేరిన 9 మాసాల్లోనే ఎమ్మెల్యే అయ్యాయని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు, తాను కూడ రాజకీయాల్లో చేరిన 9 మాసాల్లోనే ఎమ్మెల్యే అయ్యాయని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు.

మూడేళ్ళకే మంత్రిపదవికి తన పేరు పరిశీలనలోకి రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని అనిత అభిప్రాయపడ్డారు. మంత్రిపదవి దక్కకపోవడం పట్ల తనకు చాలామంది ఫోన్ చేసి తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు.

అయితే మూడేళ్ళకే మంత్రిపదవి కోరుకోవడం కొంత అత్యాశే అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ళుగా మంత్రి పదవి కోసం వేచిచూస్తున్నవారు కూడ రాజకీయాల్లో కూడ ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, టిడిపి ఎమ్మెల్యే అనితల వివాదం కారణంగా ఆమె అతితక్కువ కాలంలోనే పేరుప్రఖ్యాతలు సాధించారు.రోజాకు ఆమెకు మధ్య కౌంటర్ లు సాగేవి.

9 నెలలకే ఎమ్మెల్యేగా

9 నెలలకే ఎమ్మెల్యేగా

రాజకీయాల్లో మూడేళ్ళ చిన్నమొక్కను. రాజకీయ నేపథ్యంలో చిన్నవయస్సులోనే కేబినెట్ మినిష్టర్ హోదాకి పోటీ ఇవ్వగలిగానను ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చేరిన 9 మాసాలకే ఎమ్మెల్యేగా అవడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. 9 మాసాల్లోనే ఎన్ టి ఆర్ పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారని ఆమె గుర్తుచేశారు. అయితే తనపై మరింత బాధ్యత పెరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఎన్ టి ఆర్ నాన్నకు పిచ్చి అభిమాని

ఎన్ టి ఆర్ నాన్నకు పిచ్చి అభిమాని

టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు నాన్న పిచ్చి అభిమాని ఆమె గుర్తుచేసుకొన్నారు. ఆ అభిమానమే తనను తన తండ్రి కొట్టడానికి కారణమైందన్నారు. ఎన్టీఆర్ చనిపోయాడంటూ చేతిలోకి నోట్ బుక్ ను గాల్లోకి ఎగరేస్తూ డాడీకి చెప్పాను. తనపై డాడీ ఫట్ మని కొట్టాడని ఆమె గుర్తుచేసుకొన్నారు.ఈ సందర్భాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.

అనతికాలంలోనే ప్రాచుర్యం

అనతికాలంలోనే ప్రాచుర్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత అనతికాలంలోనే ప్రాచుర్యం పొందారు. అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే రోజాతో గొడవ సందర్భంగా అనిత, రోజాల విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.రోజాకు ధీటుగా స్పందించింది.వైసీపీని ఎదుర్కొనేందుకు కొన్ని సమయాల్లో టిడిపి అనితను రంగంలోకి దించడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిన సందర్భాలు లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డాక్టర్ అవ్వాలనుకొని ఎమ్మెల్యే అయ్యారు

డాక్టర్ అవ్వాలనుకొని ఎమ్మెల్యే అయ్యారు

డాక్టర్ అవ్వాలనుకొని ఆమె ఎమ్మెల్యే అయ్యారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 9 మాసాలకే అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిత.చిన్నతనంలో ఆమె డాక్టర్ కావాలనుకొన్నారు. కానీ, కొన్ని కారణాలతో ఆమె డాక్టర్ కాలేదు. ఎమ్మెల్యే అయిన మూడేళ్ళకే మంత్రిపదవి రేసులో ఆమె పేరు ప్రముఖంగా ప్రస్తావనకు రావడం సంచలనమే.

English summary
Iam become as MLA in 9 months said Payakaraopeta MLA Vangalapudi Anita.She interviewed a channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X