బాబు నిర్ణయమే శిరోధార్యం, పార్టీ మారను: వర్ల రామయ్య
అమరావతి: పార్టీ తీసుకొన్న నిర్ణయం బాధ కల్గించిందని టిడిపి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రకటించారు. అయితే పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తానని రామయ్య స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు సీఎం రమేష్ పేరుతో పాటు వర్ల రామయ్య పేరు విన్పించింది. అయితే అనుహ్యంగా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు రాజ్యసభ అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయమై పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు మీడియాకు విడుదల చేశారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబునాయుడు వర్లరామయ్యకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు.
రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ కనకమేడల రవీంద్రకుమార్ కు రాజ్యసభకు పంపాల్సి వచ్చిందని బాబు చెప్పారు. అన్ని రకాలుగా న్యాయం చేస్తామని వర్ల రామయ్యకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు
పదవుల కోసం తాను పార్టీ మారే ప్రసక్తే లేదని వర్ల రామయ్య ప్రకటించారు. పార్టీ తీసుకొన్న నిర్ణయం తనకు బాధ కల్గించిందన్నారు. అయినా పార్టీ మారే ప్రసక్తే లేదని వర్ల రామయ్య చెప్పారు. పార్టీ కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని వర్ల రామయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications