లబ్దికోసమే హోదా పోరాటం, ఏ పార్టీలో లేను, నాకు ఆత్మగౌరవం ఉండదా?:కొత్తపల్లి గీత

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తాను ఇప్పుడు ఏ రాజకీయలో లేనని, ఏ రాజకీయ పార్టీ లబ్ధి కోసం తాను పనిచేయడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు.ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని రాజకీయపార్టీలు చూస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలు ఈ విషయాలన్నీ కూడ ఆలోచించనున్నారని ఆమె తేల్చి చెప్పారు.

ఓ తెలుగున్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఆందోళనల విషయాలపై ఆమె స్పందించారు.

భవిష్యత్‌ రాజకీయాలపై ఆమె స్పందించారు. అయితే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఏపీ రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రస్తుతం నిరసనల బాట పట్టాయని ఆమె అభిప్రాయపడ్డారు.

నేను ఏ రాజకీయ పార్టీలో లేను

నేను ఏ రాజకీయ పార్టీలో లేను

తాను ఏ రాజకీయపార్టీలో లేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఏపీ రాష్ట్రం విడిపోయినా సామాన్యుడికి నష్టం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పరిపాలన పరంగా రాష్ట్రానికి వెసులుబాటు లభిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనందునే ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆందోళనలో పాల్గొనడం లేదని ఆమె చెప్పారు.

 రాజకీయం కోసం పార్టీల నిరసనలు

రాజకీయం కోసం పార్టీల నిరసనలు

రాజకీయ లబ్ది కోసం ఏపీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు.ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్దిపొందాలని భావిస్తున్నాయని ఆమె ఆరోపించారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.పార్లమెంట్‌లోపల ఎంపీల పోరాటం రాజకీయం కోసమేనని ఆమె చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో కాలమే నిర్ణయం

వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో కాలమే నిర్ణయం


వచ్చే ఎన్నికల్లో తాను ఏం చేయాలనే విషయమై కాలమే నిర్ణయిస్తోందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. ప్రస్తుతం తాను స్వతంత్రంగా ఉన్నానని చెప్పారు. టిడిపి, వైసీపీ, బిజెపిలను కూడ విమర్శిస్తానని ఆమె చెప్పారు. ప్రజల సమస్యలను తాను ప్రస్తావిస్తానని కొత్తపల్లి గీత చెప్పారు.ఇప్పటివరకు తాను ఏ పార్టీలో కొనసాగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి కాలమే సమాధానం చెబుతోందని చెప్పారు.

అందుకే టిడిపికి దూరంగా

అందుకే టిడిపికి దూరంగా

వైసీపీకి దూరంగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్దికి టిడిపితో కలిసి పనిచేయాలని భావించానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. అయితే కొందరు అధికారులు మాత్రం తాను సూచించిన పనులు చేయకూడదని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని చెప్పారు.ఈ విషయమై టిడిపి ముఖ్య నేతను కలిస్తే పార్టీలో చేరాలని సూచించారని ఆమె గుర్తు చేసుకొన్నారు. టిడిపిలో చేరనని తెగేసి చెప్పానని కొత్తపల్లి గీత చెప్పారు.

ఆత్మగౌరవం ఉండదా

ఆత్మగౌరవం ఉండదా


తెలుగోడికి, ఆంధ్రులకు ఆత్మగౌరవం ఉంటుంది, కానీ, మనిషికి ఆత్మగౌరవం ఉండదా అని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. తనను ఎన్నుకొన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేసినట్టు చెప్పారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని భావించినప్పుడు మోడీ తనను రాజీనామాల చేయకూడదని సూచించారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Araku Mp Kothapalli Geetha said that Iam not belongs to any political party. A Telugu news channel interviewed her on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి