ఏపీ నూతన సీఎస్‌గా అనిల్‌చంద్ర పునీత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్‌చంద్ర పునీత పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా అనిల్‌చంద్ర పునీతను ఎంపిక చేస్తూ సీఎం నిర్ణక్ష్ం తీసుకున్నారు.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునీత రాజంపేట సబ్ కలెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, ఉద్యాన, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు. కాగా, సీఎస్‌గా ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబును అనిల్‌చంద్ర పునీత కలిశారు. తనను సీఎస్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications