దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిణి పద్మ
విజయవాడ: విజయవాడ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈవో)గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి పూజలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం, నిబంధనల ప్రకారం చేయించడం...భక్తులకు దర్శనం సజావుగా చేయించడమే తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
అలాగే ఆగమశాస్త్రం పరంగానే గుడి వ్యవహారాలు అన్నీ సాగేలా చూస్తానని విజయవాడ దుర్గగుడి నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ స్ఫష్టం చేశారు. ఉద్యోగులు, పాలకమండలి సభ్యులను కలుపుకొని పనిచేస్తానని అన్నారు.

గుడి పాలన వ్యవహారాల్లో ఈ-గవర్నెన్స్ విధానాలు అమలు చేస్తామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ కూడా పకడ్బందిగా పాలన వ్యవహారాలు చూడాలని అమ్మవారు తనకు కలలో కనిపించి చెప్పినట్లు ఆమె వెల్లడించారు.












Click it and Unblock the Notifications