Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IAS Srilakshmi: స్టే ఎంజాయ్ చేశారు. ఇక ట్రయల్ ఫేస్ చేయండి!

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయగా, దానిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే, సీబీఐ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ ధర్మాసనం, ఆమెపై విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది.

IAS Srilakshmi OMC Case Supreme Court Dismisses Discharge Petition Orders Immediate Trial in Mining Scam

IAS Srilakshmi గురించికోర్టు కీలక వ్యాఖ్యలు:

గతంలో వేరే కేసుగా భావించి ఈమెకు స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని కోర్టు పేర్కొంది. "మా పొరపాటు వల్ల వచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ఎంజాయ్ చేశారు" అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వెంటనే ట్రయల్ కోర్టులో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది.

సీబీఐ మోపిన అభియోగాలు ఇవే..

ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ బలమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచింది:

  • క్యాప్టివ్ మైనింగ్ పదం తొలగింపు: నిబంధనల ప్రకారం గనుల నుంచి తీసిన ఖనిజాన్ని సొంత పరిశ్రమలకే వాడాలి (క్యాప్టివ్ మైనింగ్). కానీ శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేసేందుకు కావాలనే ఆ పదాన్ని జీవో నుంచి తొలగించి, ఖనిజాన్ని బయట అమ్ముకునేలా అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ వాదించింది.
  • అక్రమాస్తుల కూడబెట్టడం: ఆమె పదవిలో ఉన్న సమయంలో ఆమె బంధువులు (మరిది) భారీగా అక్రమాస్తులు సంపాదించారని, ఇది క్విడ్ ప్రో కోలో భాగమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అసలు ఏమిటీ ఓఎంసీ కేసు? (OMC Case)

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పెను సంచలనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కర్ణాటక గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ సంస్థకు అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజులు కేటాయించారు. కేటాయించిన సరిహద్దులను దాటి ఓఎంసీ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, అటవీ భూములను ఆక్రమించిందని ఆరోపణలు వచ్చాయి.

సుమారు 8.5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఓఎంసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని సీబీఐ ఆమెను నిందితురాలిగా చేర్చింది. 2011లో ఆమె ఈ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు. గత పదేళ్లకు పైగా ఈ కేసు విచారణ దశలోనే ఉంది. తనపై ఉన్న ఆరోపణల్లో నిజం లేదని, విచారణ నుంచి తనను తప్పించాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా సుప్రీం తీర్పుతో బ్రేక్ పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+