కలిసుందామన్న ప్రొఫెసర్, భార్య నో!: ఎవరు దాచారు?
హైదరాబాద్: రైలు కిందపడి ప్రొఫెసర్ గురుప్రసాద్ (40) ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తీసుకువెళ్లిన పిల్లల ఎక్కడున్నారనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, పిల్లను తీసుకు వెళ్లేందుకు భార్య వద్దకు వెళ్లిన గురుప్రసాద్ కలిసి ఉందామని ఆమెతో చెప్పారని తెలుస్తోంది. అయితే, అందుకు ఆమె నిరాకరించారని సమాచారం.
ఇదిలా ఉండగా.. పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేడ్చల్‌లో గురుప్రసాద్‌కు స్థిరాస్తులు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. ఆ ప్రాంతంలో దాచి ఉంటారని భావిస్తున్నారు. అలాగే, గురుప్రసాద్ సొంతూరు కడపకు కూడా ఓ బృందం వెళ్లింది.

సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసులు ఆధారాలను సేకరించారు.త సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. జేమ్స్ స్ట్రీట్‌లో గురుప్రసాద్ బైకును స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోట్ టవర్ ఆధారంగా మేడ్చల్‌లో గురుప్రసాద్ చివరి కాల్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఆయన శనివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మేడ్చల్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. గురుప్రసాద్ తన సూసైడ్ నోట్లో భార్య వేధించిన విషయం రాసినట్లుగా తెలుస్తోంది. అయితే, పిల్లలు ఎక్కడున్నారనే విషయం మాత్రం రాయలేదు. మరోవైపు అసలు పిల్లలను గురు ప్రసాద్ ఎక్కడైనా దాచి పెట్టారా? లేక మరెవరైనా దాచి పెట్టారా? అనే కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. బంధువులను పిలిచి పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications