వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకుంటే తెలుగుదేశం, జనసేనకు ద‌బిడి దిబిడే??

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఒక‌వేళ ఆ నిర్ణ‌యం క‌నుక తీసుకుంటే రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ద‌బిడి దిబిడేన‌ని, అవ‌న్నీ క‌చ్చితంగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇంత‌కీ ఆ నిర్ణ‌యం ఏమిటంటే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం. కొన్ని నెల‌లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి జ‌రిగే చ‌ర్చ‌క‌న్నా ఎక్కువ‌గా ఏ విష‌యంమీద చ‌ర్చ జ‌ర‌గ‌డంలేదంటే అతిశ‌యోక్తి కాదు.

 వైసీపీకి సేవ‌లందించ‌నున్న రిషిరాజ్‌సింగ్‌

వైసీపీకి సేవ‌లందించ‌నున్న రిషిరాజ్‌సింగ్‌


గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. దీంతో ఐప్యాక్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన రిషిరాజ్‌సింగ్ ఇక‌నుంచి వైసీపీకి స‌హ‌కారం అందించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌ని మొద‌లుపెట్టారు. ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ ఎమ్మెల్యేల‌మీద వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంది? ఎవ‌రికి అనుకూలంగా ఉంది? ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు, ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే అధికార పార్టీ ప‌రిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీ బ‌లాబ‌లాలు ఏమిటి? అనే విష‌యాల‌పై ఇప్ప‌టికే స‌ర్వే నిర్వ‌హించారు. వ‌చ్చిన ఫ‌లితాల‌న్నింటినీ క్రోడీక‌రించి ఒక నివేదిక రూపంలో త‌యారుచేస్తున్నారు.

ఆ నాలుగు రాష్ట్రాల‌తోపాటు ముందుకు వెళ్దామ‌ని!!

ఆ నాలుగు రాష్ట్రాల‌తోపాటు ముందుకు వెళ్దామ‌ని!!


వ‌చ్చే సంవ‌త్స‌రం తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌డ్‌, రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటితోపాటు ఎన్నిక‌ల‌కు వెళ్తే ఎలా ఉంటుంద‌నేది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆలోచ‌న‌గా ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబ‌రులో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసి మార్చిలో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది ప్ర‌భుత్వ వ్యూహంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రుగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం వాస్త‌వానికి ఏడాదిపాటు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కానీ మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి వారికి ఎనిమిది నెల‌లే స‌మ‌యం ఇచ్చారు.

 రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది.. ముంద‌స్తుకు వెళ్లం?

రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది.. ముంద‌స్తుకు వెళ్లం?


అక్టోబ‌రు 5వ తేదీ నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తి నుంచి బ‌స్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల్లోకి రావ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఇవ‌న్నీ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంకేతాలేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి కావ‌ల్సినంత స‌మ‌యం ఉంద‌ని, ముంద‌స్తు ఎన్నిక‌లు అనేవి కేవ‌లం ఊహాగానాలేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కొట్టిపారేస్తున్నారు. ఎవ‌రు చెప్పేది నిజ‌మ‌నేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు మ‌రి.!!

English summary
If Jagan makes that decision then to the tdp and janasena are weak?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X