వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఎసిబి నోటీస్ తీసుకోకపోతే ఏమవుతుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసు ఇస్తే తీసుకోకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు నోటీసు ఇచ్చే అధికారం తెలంగాణ ఎసిబికి లేదని, ఆ నోటీసును తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది వాదిస్తున్నారు. నోటీసు తీసుకోకుండా తెగేదాకా లాగుదామని చంద్రబాబు అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

తెలంగాణ ఎసిబి నోటీసు ఇస్తే తీసుకోకపోవడం అనేది ఏ విధమైన పరిణమాలకు దారి తీస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణ ఎసిబి నోటీసు ఇస్తే చట్టప్రకారం చంద్రబాబు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. నోటీసు తీసుకోకపోతే అది మరో కేసు అవుతుందని కూడా చెబుతున్నారు.

If Chandrababu rejects to take ACB notice...?

చంద్రబాబు నోటీసు తీసుకోకపోతే కోర్టు ద్వారా అరెస్టు వారంట్ కూడా పొందవచ్చునని, కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబుకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కూడా తెలియడం లేదని, అవి సరైనవి కావని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్టపరమైన విషయాలను అవగాహన చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా కొంత మంది మాట్లాడుతున్నారని అంటున్నారు. హైదరాబాదులో పోలీసు స్టేషన్లు పెడుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనడం కూడా అటువంటిదేనని అంటున్నారు. దానిలో ఉన్న చట్టపరమైన విషయాలను అవగాహన చేసుకుని, గవర్నర్ సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
If Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu will reject to take Telangana ACB notice, it will become another case, according to legal experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X