వాళ్లను కాదనుకుంటే ఈసారి వైఎస్ జగన్‌కు ఢోకా లేదు??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందుకు తగ్గ వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాలను పునాదిగా మార్చుకొని ఎన్నికలకు వెళ్లబోతున్న జగన్‌కు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని ఐప్యాక్ సర్వేతోపాటు ఇంటిలిజెన్స్ నివేదికల్లో కూడా వెల్లడైంది. వాటిని అధిగమిస్తే ఈసారి అధికారానికి ఎటువంటి ఢోకా లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యేలపై తీవ్ర ఆాగ్రహం
ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని రూపొందించారు. 12 నెలలపాటు ప్రజాప్రతినిధులంతా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవ్వాలి. ప్రభుత్వంపై ప్రజల్లో ఏ అశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందనే విషయాలను ఒక నివేదిక రూపంలో అధిష్టానానికి సమర్పించాలి. అసలు ఎమ్మెల్యేలే ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతుండటంపై వర్క్ షాప్‌లో జగన్ వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటివారితోనే భవిష్యత్తులో పార్టీకి తలనొప్పలు ప్రారంభమవుతాయనే యోచనలో అధినేత ఉన్నారు.

వ్యతిరేకత మూటగట్టుకుంటే పార్టీకే నష్టం
నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికల్లో కొనసాగిస్తే అది ప్రభుత్వంపై పడుతుందని, అంతిమంగా అధికారానికి చేటు తెస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, సీట్లు నిరాకరిస్తానని ఖరాఖండిగా తేల్చేస్తున్నారు. ఇప్పటికే సొంతంగా సర్వే నిర్వహింపచేసుకున్న జగన్ కొన్ని పేర్లను టిక్ మార్క్ చేసుకుున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి.

ప్రజలతో మమేకమైనవారితోనే లాభం
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గీత దాటి వ్యవహరిస్తున్నారని, నిధులివ్వకుండా నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తాం? ఎలా మంచి పేరు తెచ్చుకుంటామంటూ బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. అయితే నిధులతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమవుతూ మంచిపేరు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అటువంటివారిల్ల పార్టీకి ఉపయోగమని, నిధుల కోసం ఎదురుచూసేవారివల్ల పార్టీకి నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఎవరెవరికి సీటు నిరాకరించబోతున్నారు? కొత్తవారు ఎవరు? తదితర విషయాలపై ముఖ్యమంత్రి ఒక స్పష్టతనివ్వబోతున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications