'రాష్ట్రం మూడడుగులు వెనక్కి, బాబు అవసరమా?: మేమొస్తే గ్రామానికో సచివాలయం'

Subscribe to Oneindia Telugu
YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

కర్నూలు: కడప జిల్లాలో ముగిసిన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి కొనసాగిన ఆయన పాదయాత్ర ముత్యాలంపాడు బస్టాండు మీదుగా సాగింది.

కష్టమే?, జగన్ మార్చుకుంటారా!: వైఎస్ఆర్ జోష్ ఎక్కడ?..లేకపోతే రొటీన్ అయే ఛాన్స్..

ముత్యాలంపాడు బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, భవిష్యత్తులో తమ పార్టీ తీసుకురాబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతీ పేదవాడికి అండగా నిలబడాలన్నదే తమ ధ్యేయంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ఏడాది ఓపిక పట్టండి:

ఒక్క ఏడాది ఓపిక పట్టండి:

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. ఎక్కడ చూసినా పేదలకు సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను గాలికొదిలేశారు. ఇంతవరకూ ఏ ఒక్క హామి కూడా నెరవేర్చలేదు. మీరంతా ఒక్క ఏడాది ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలు, రైతులు ఆకాంక్షించే పాలన సాగిద్దాం' అంటూ జగన్ ప్రసంగించారు.

గ్రామానికో సచివాలయం:

గ్రామానికో సచివాలయం:


'వచ్చే దఫా మన ప్రభుత్వం వస్తే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం తెరుస్తాం. అర్హులైన అందరికీ పథకాలు అందేలా చూస్తాం. ఏ పథకానికైనా సరే.. దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటాం' అని జగన్ వ్యాఖ్యానించారు.

మూడడుగులు వెనక్కి:

మూడడుగులు వెనక్కి:

చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు జగన్. రాష్ట్రంలో అభివృద్ధి నాలుగడుగులు ముందుకు వేయడం మానేసి, మూడడుగులు వెనక్కి వెళ్తోందన్నారు. ఇలాంటి విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వం మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రజల సలహాలు, సూచనల మేరకు రెండు మూడు పేజీల మేనిఫెస్టోతో 2019 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. 2019ఎన్నికల్లో గెలిచి.. ఇచ్చిన హామిలను నెరవేర్చి 2024లో మళ్లీ ప్రజల వద్దకు వస్తామన్నారు.

హెరిటేజ్ దళారులు:

హెరిటేజ్ దళారులు:

పాదయాత్రలో ఎవరిని పలకరించినా వైఎస్‌ పాలన గురించే చర్చించుకుంటున్నారని జగన్ అన్నారు. బ్యాంకులో పెట్టిన బంగారం కావాలంటే బాబు సీఎం కావాలని అన్నారని, ఆయన సీఎం అయ్యాక బంగారం ఇంటికి రాలేదని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న హామికి ఇప్పటకీ మోక్షం లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) supremo YS Jaganmohan Reddy covered 100 km as his Praja Sankalpam padayatra on Tuesday reached Kurnool district
Please Wait while comments are loading...