సాంబారులో కప్ప: రొడ్డెక్కిన ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు
కడప: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోడ్డెక్కారు. గత కొంత కాలంగా మెస్ నిర్వాహకులపై విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి విద్యార్ధులు నిరసన చేపట్టారు. మధ్యాహ్నాం భోజనానికి వెళ్లిన విద్యార్ధులకు సాంబారులో కప్ప కనిపించింది.

దీంతో ఇడుపులపాయ నుంచి కడపకు 400 మంది విద్యార్ధులు రాస్తారాకో చేపట్టారు. వీరందరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గండి-ఇడుపులపాయ రహదారిపై బైఠాయించారు. మెస్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చెప్పినా, ఇది ఎన్నోసారని ప్రశ్నించిన విద్యార్ధులు కలెక్టర్ వచ్చి మెస్ నిర్వహకుడిని మారుస్తానని హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని చెప్పారు.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సుమారు 6 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. కొత్త క్యాంప్‌సలో సోమవారం ఉదయం ఈ-1, ఈ-2, ఈ-3లకు చెందిన సుమారు 2 వేలమందికి పైగా విద్యార్థులు తరగతులు వదిలి తొలుత క్యాంపస్ ఆవరణలో బైఠాయించారు. కేఎమ్‌కే మెస్‌లో తయారైన సాంబారులో కప్పలు ఉన్నాయని, భోజనం సక్రమంగా అందించడంలేదని నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.