విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకలి కేకలు: విశాఖలో యానిమేటర్ల ధర్నా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పద్నాలుగు నెలలుగా జీతాలు లేకుండా వాళ్లు బతుకులు వెళ్లదీస్తున్నారు. అప్పులు చేసుకుంటూ బతుకులు ఈడుస్తున్న ఐకెపి యానిమేటర్లు సోమవారం ధర్నాకు దిగారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాళ్లు సోమవారం విశాఖపట్నంలోని ఎంపిపి కాలనీలో గల డిఆర్‌డిఎ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

జిల్లాలో ఉన్న 1420 మంది యానిమేటర్లకు సెర్ప్ సంస్థ 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దాంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని జిల్లా యానిమేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామసుశీల అన్నారు.

డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వి. సత్యసాయి శ్రీనివాస్‌కు వారు తమ గోడును వినిపించుకున్నారు. దీనికి ఆయన స్పందించారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

గత 14 నెలలుగా బాకీ పడిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐకెపి యానిమేటర్లు విశాఖలో డిఆర్‌డిఎ కార్యాలయం ముందు సోమవారం ధర్నాకు దిగారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఐకెపి యానిమేటర్లు ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల సమస్యలపై పలు ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదని సిటు జిల్లా నాయకుడు డి. శ్రీనివాస రావు విచారం వ్యక్తం చేశారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వేతనాలను చెల్లిస్తామని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ హామీ ఇచ్చారు. దాంతో యానిమేటర్లు ఆందోళన విరమించారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

ఐకెపి యానిమేటర్లు సోమవారం డిఆర్‌డిఎ కార్యాలయం ముందు ధర్నాకు దిగి, తమ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

యానిమేటర్ల ధర్నా

యానిమేటర్ల ధర్నా

ఐకెపి యానిమేటర్లు ధర్నా చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జిల్లాలోని యానిమేటర్లకు 14 నెలలుగా వేతనాలు లేవని వారన్నారు.

English summary
IKP animators staged dharna in front of DRDA office in Visakhapatnam demanding salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X