భర్త మృతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ..ఆమెనే చంపి పిల్లల్ని అనాధలు చేసిన దారుణం
భర్త మృతితో ఇద్దరు పిల్లలతో బతుకీడుస్తున్న ఓ మహిళ వేరే వ్యక్తిని నమ్ముకుంది. ఆ వ్యక్తిపై ఆమె పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట శాపమైంది. తనకు తన పిల్లలకు అండగా ఉంటాడనుకుంటే, అనుమానంతో ఆమెనే హతమార్చాడు సదరు ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన 23 ఏళ్ల అరుణకు కొద్ది రోజుల క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అరుణ ఇంటి పక్కనే ఉన్న శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను తన కుటుంబానికి అండగా నిలుస్తాడని నమ్మింది.
ఇక అరుణ బతుకు దెరువుకోసం అన్నవరంలోని హరిణి బోటు షికారులో పనిచేస్తోంది. కొంతకాలం పాటు సాగిన వేరి వివాహేతర సంబంధం వ్యవహారంలో క్రమక్రమంగా మనస్పర్థలు వచ్చాయి. ఆమె వేరే ఎవరితోనో దగ్గరగా ఉంటుందని శ్రీను ఆమెను వేధించసాగాడు. ఇక ఇదే క్రమంలో అన్నవరంలోని బోటు షికారు లో పనిచేస్తున్న అరుణను అక్కడి నుండి బయటకు తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను నదిలోకి తోసి చంపేశాడు. ఇక ఈ నెల రెండో తేదీ నుంచి కనబడకపోయేసరికి కుటుంబ సభ్యులు తొండంగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

స్థానికులకు శ్రీను పై అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించగా కానీ అరుణ ని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. అంతేకాదు అరుణ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేశానని చెప్పాడు. సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పేశాడు . ఇక ఈ ఘటనతో అటు తండ్రి లేక, ఇటు తల్లి హత్యకు గురి అరుణ ఇద్దరు బిడ్డలు అనాధలయ్యారు. తనకు తన బిడ్డలకు అండగా ఉంటాడని అరుణ తీసుకున్న తప్పుడు నిర్ణయం చివరకు ఆమె జీవితాన్ని బలి చేసింది. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు లేని బిడ్డలుగా , అనాథలుగా మార్చింది. ఇక అరుణను హతమార్చిన శ్రీను జైలు పాలయ్యాడు .
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications